ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ 'Snooze'

'Snooze' పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఫేస్‌బుక్ పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా ఫేస్‌బుక్ యూజర్లు తమను నోటిఫికేషన్‌లతో ఇబ్బందిపెడుతున్న ఫ్రెండ్ లేదా పేజ్ గ్రూప్‌ను తాత్కాలికంగా మ్యూట్ చేసే వీలుంటుంది. ఈ ఫీచర్‌తో ఫ్రెండ్ లేదా పేజ్ గ్రూప్‌ను 24 గంటలు, 7 రోజులు, 30 రోజులు ఇలా మూడు టైమ్ లిమిట్ ఆప్షన్స్‌లో మ్యూట్ చేయవచ్చు. 

 ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ 'Snooze'

Read More : ఇక ఐడీ‌ప్రూఫ్ క్రింద m-Aadhaar చాలు

సాధారణంగా మన ఫేస్‌బుక్ పేజీలలో ఫ్రెండ్స్ ఎవరైనా అసభ్యకర పోస్టింగ్స్ లేదా ఫోటోలను పోస్ట్ చేస్తున్నట్లయితే వారిని అన్ ఫ్రెండ్ చేయటం లేదా అన్ ఫాలో చేస్తుంటాం. ఇక పై అలా చేయకుండా వారిని కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా మ్యూట్‌లో ఉంచటమే ఈ స్నూజ్ ఫీచర్ ప్రత్యేకత.

 ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ 'Snooze'

Read More : ఐఫోన్ ఎక్స్.. 5 కొత్త పీచర్లు

తొలత ఈ ఆప్షన్ ను అమెరికాలోని ఫేస్ బుక్ యూజర్లు గుర్తించారు. పోస్ట్ రైట్ కార్నర్‌లో కనిపించే మూడు డాట్ల మెనూ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే 'Unfollow or Snooze' అనే ఆపన్ష్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయటం ద్వారా ఫ్రెండ్ లేదా పేజ్ గ్రూప్‌ను తాత్కాలికంగా మ్యూట్ చేసే వీలుంటుంది.

English summary
Facebook is testing 'Snooze' feature to unfollow friends, pages and groups for limited time. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot