ఫేస్‌బుక్ నుంచి గ్రూప్ వీడియో చాటింగ్ యాప్

సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ఫేస్‌బుక్, Bonfire పేరుతో ఓ గ్రూప్ వీడియో చాటింగ్ యాప్‌ను పరీక్షిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Read More : నాలుగు కెమెరాలతో Infocus Snap 4, ధర రూ.11,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Danish App Storeలో..

తాజాగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం ఈ యాప్‌ను కొద్ది గంటల క్రితమే Danish App Storeలో ఫేస్‌బుక్ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ యాప్‌ను గ్లోబల్ మార్కెట్లలో ప్రవేశపెట్టే అవకాశముంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను వశం చేసుకున్న ఫేస్‌బుక్ ఆయా రంగాల్లో రాణిస్తోన్న విషయం తెలిసిందే.

ఒకేసారి 8 మంది వీడియో చాటింగ్..

Bonfire యాప్‌లో ఒకేసారి 8 మంది గ్రూపుగా ఏర్పడి వీడియో చాటింగ్ నిర్వహించుకునే వీలుటంది. గ్రూప్ సభ్యుల సంఖ్యను మరింత పొడిగించే అవకాశం ఉంది. ఫేస్‌బుక్ మెసంజర్ నుంచే నేరుగా ఈ వీడియో చాటింగ్ యాప్‌లోకి వెళ్లిపోయే వీలుంటుంది.

ప్రస్తుతానికి డెన్‌మార్క్‌లో మాత్రమే వర్క్ అవుతోంది..

ప్రస్తుతానికి ఈ యాప్ డెన్‌మార్క్‌లో మాత్రమే వర్క్ అవుతోంది. త్వరలోనే మరిన్ని దేశాల యూజర్లకు, ఫేస్‌బుక్ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ గ్రూప్ చాటింగ్ యాప్‌కు Skype, Tumblr నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook Launches Bonfire – The Group Video Chat App. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot