యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్ 'Watch'

యూట్యూబ్, విమియో వంటి వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను ఉపయోగించుకుంటోన్న వారికి ఫేస్‌బుక్ వాచ్ మరో ప్రత్యామ్నాయం కానుంది.

|

గతకొంత కాలంగా వీడియో కంటెంట్ పై దృష్టిసారిస్తోన్న ఫేస్‌బుక్, తాజాగా మరో ఫీచర్‌ను లాంచ్ చేసింది. 'Watch' పేరుతో సరికొత్త సర్వీసును ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ అనౌన్స్ చేసారు. ఫేస్‌బుక్ యాప్‌లో ఓ భాగంగా ఉండే ఈ సర్వీస్ యూట్యూబ్ తరహాలో పూర్తిస్థాయి వీడియో సర్వీసులను అందిస్తుంది.

Redmi Note 4 ఫోన్‌లకు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్Redmi Note 4 ఫోన్‌లకు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్

వారికి మరో ప్రత్యామ్నాయం...

వారికి మరో ప్రత్యామ్నాయం...

యూట్యూబ్ తరహాలొనే ఇక్కడ కూడా వీడియోలను అప్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. నచ్చిన ఛానల్స్‌ను సబ్‌స్ర్కైబ్ కూడా చేసుకోవచ్చు. యూట్యూబ్, విమియో వంటి వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను ఉపయోగించుకుంటోన్న వారికి ఫేస్‌బుక్ వాచ్ మరో ప్రత్యామ్నాయం కానుంది.

Automatic video-playback

Automatic video-playback

ఇప్పటికే యూట్యూబ్‌కు పోటీగా ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చిన ‘Automatic video-playback' పట్ల పలువురు యూజర్ల నుంచి నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వ్యక్తమవుతోంది. ఈ ఫీచర్, వీడియోలను ఇష్టపడి ప్లే చేసుకునే స్వేచ్ఛకు విరుద్ధంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వెంటనే disable చేసుకోవచ్చు

వెంటనే disable చేసుకోవచ్చు

ఫేస్‌బుక్ ఆటోమెటిక్ వీడియో ప్లేబ్యాక్ ఫీచర్‌లో భాగంగా ఫేస్‌బుక్ పేజీలలో వీడియోలు డీఫాల్ట్‌గా ఆటో‌ప్లే అవటం మీరు గమనించే ఉంటారు. వీడియోలు రన్ అవుతున్నంత సేపు మన బ్యాండ్ విడ్త్ ఖర్చవుతూనే ఉంటుంది. వీడియో రంగంలో యూట్యూబ్‌ను అధిగమించేందకు ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఏదమైనప్పటికి ఈ ‘Automatic video-playback' ఫీచర్ మీకు ఇబ్బందని అనిపించినట్లయితే వెంటనే disable చేసుకోవచ్చు. అది ఏలాగో ఇ్పపుడు చూద్దాం..

ఫేస్‌బుక్ అకౌంట్‌లను కంప్యూటర్‌లలో ఉపయోగించుకునే వారు ఇలా చేయాలి

ఫేస్‌బుక్ అకౌంట్‌లను కంప్యూటర్‌లలో ఉపయోగించుకునే వారు ఇలా చేయాలి

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత స్ర్కీన్ కడు వైపు పై భాగంలో ఏర్పాటు చేసిన downward arrow sign పై క్లిక్ చేసినట్లయితే డ్రాప్‌డౌన్ మెనూ వస్తుంది. ఆ menuలో ‘సెట్టింగ్స్ ఆప్షన్' పై క్లిక్ చేయండి. ఇప్పుడు కనిపించే General Account Settingsలో ఎడమచేతి వైపు కనిపించే videos ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. వీడియో సెట్టింగ్స్ ఓపెన్ అయిన తరువాత Default మోడ్‌లో ఉన్న ఆటో-ప్లే వీడియోస్ ఆప్షన్‌ను ‘OFF' మోడ్‌లోకి మార్చండి. అంతే, వీడియోలు ఆటోప్లే అవటం మానేస్తాయి.

ఫేస్‌బుక్ అకౌంట్‌లను స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించుకునే వారు ఇలా చేయాలి

ఫేస్‌బుక్ అకౌంట్‌లను స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించుకునే వారు ఇలా చేయాలి

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ ద్వారా ఫేస్‌బుక్‌ను వాడుతున్నట్లయితే On, Wi-Fi only, Off ఆప్షన్‌ల ద్వారా వీడియో ఆటో - ప్లే సెట్టింగ్‌లను అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం.. ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి Video Auto-play ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని సెట్టింగ్‌లను మీకు నచ్చినట్టుగా మార్చుకోండి.

Best Mobiles in India

English summary
Facebook launches Google YouTube rival, 'Watch'. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X