ఫేస్‌బుక్ కొత్త యాప్ ‘మెసెంజర్ కిడ్స్’

|

ఫ్యామిలీస్‌కు మరింత దగ్గరయ్యే క్రమంలో సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ 'మెసెంజర్ కిడ్స్’ పేరుతో సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్ ద్వారా 13 సంవత్సరాల్లోపు పిల్లలు సురక్షితంగా చాట్ చేసుకునే వీలుంటుంది.

 
ఫేస్‌బుక్ కొత్త యాప్  ‘మెసెంజర్ కిడ్స్’

ఈ యాప్ ప్రస్తుతానికి యూఎస్‌లో మాత్రమే లభ్యమవుతోంది. ఈ ప్రత్యేకమైన యాప్‌ను చిన్నారుల కోసం రూపొందించే టాబ్లెట్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. పేరెంట్స్ ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా మెసెంజర్ కిడ్స్ యాప్‌ను కంట్రోల్ చేసుకునే వీలుంటుంది.

మెసెంజర్ కిడ్స్ యాప్ కుటుంబాల మధ్య చోటుచేసుకునే ఆన్‌లైన్ కమ్యూనికేషన్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళుతుందని ఫేస్‌బుక్ ప్రొడెక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ లారిన్ చింగ్ ఓ ప్రముఖ బ్లాగ్‌ స్పాట్‌లో పేర్కొన్నారు.

ఫేస్‌బుక్ కొత్త యాప్  ‘మెసెంజర్ కిడ్స్’

ఈ యాప్‌లో అందుబాటులో ఉండే వీడియో చాటింగ్ ఫీచర్ ద్వారా చిన్నారులు దూరాన ఉన్న తమ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో ముచ్చటించే వీలుంటుంది. మెసెంజర్ కిడ్స్ యాప్‌కు సంబంధించిన ప్రివ్యూ ప్రస్తుతానికి యాపిల్ యాప్ స్టోర్‌లో లభ్యమవుతోంది.

వేలాది మంది తల్లిదండ్రులతో పాటు పదుల సంఖ్యలో అడ్వైజర్స్ అలానే నేషనల్ పీటీఏ వంటి ప్రముఖ అసోసియేషన్‌లతో చర్చించిన తరువాతనే మెసెంజర్ కిడ్స్ యాప్‌ను అభివృద్ధి చేసినట్లు ఫేస్‌బుక్ తెలిపింది.

మెసెంజర్ కిడ్స్ యాప్‌లోకి వెళ్లి పేరెంట్ తన అకౌంట్‌ను సెటప్ చేసిన తరువాతే వారి పిల్లలు ఒకరితో ఒకరు లేదా గ్రూప్ వీడియో చాట్‌ను స్టార్ట్ చేసే వీలుంటుంది.

ఫేస్‌బుక్ కొత్త యాప్  ‘మెసెంజర్ కిడ్స్’

పేరెంట్ అప్రూవ్ చేసిన కాంటాక్ట్‌లతో మాత్రమే పిల్లలు చాటింగ్ నిర్వహంచుకునే వీలుంటుంది. వీడియో
చాటింగ్‌తో పాటు పేరెంట్ అప్రూవ్ చేసిన ఫ్రెండ్స్ అలానే అడల్డ్ రిలేటివ్‌లకు మాత్రమే టెక్స్ట్ మెసేజ్‌లను పంపుకునే వీలుంటుంది. కన్వర్జేషన్‌లకు మరింత వాస్తవికతను తీసుకువచ్చే క్రమంలో ప్లేఫుల్ మాస్క్స్, ఎమెజీస్, సౌండ్ ఎఫెక్ట్స్ వంటి స్పెషల్ ఫీచర్స్ మెసెంజర్ కిడ్స్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

మెసెంజర్ కిడ్స్ అకౌంట్‌ను పేరెంట్స్ నాలుగు స్టెప్స్‌లలో సెటప్ చేసుకోవచ్చు. మొదటి స్టెప్‌లో భాగంగా మెసెంజర్ కిడ్స్ యాప్‌ను తమ చిన్నారి ఐప్యాడ్, ఐపోడ్ లేదా ఐఫోన్‌లోకి సంబంధిత యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

Flipkart Big Shopping Days sale : ఈ భారీ డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి !Flipkart Big Shopping Days sale : ఈ భారీ డిస్కౌంట్లపై ఓ లుక్కేయండి !

రెండవ స్టెప్‌లో భాగంగా పేరెంట్ తన సొంత ఫేస్‌బుక్ అకౌంట్ యూజర్ ఐడీ అలానే పాస్‌వర్డ్‌తో మెసెంజర్ కిడ్స్ అకౌంట్‌తో ధృవీకరించుకోవల్సి ఉంటుంది. మూడువ స్టెప్‌లో భాగంగా తమ చిన్నారుల పేరు మీద అకౌంట్‌ను క్రియేట్ చేసి వారి చేతికి ఇవ్వాలి. నాలుగవ స్టెప్‌లో భాగంగా కాంటాక్ట్ లిస్ట్‌ను అప్రూవ్ చేయవల్సి ఉంటుంది.

 

మెసెంజర్ కిడ్స్ యాప్‌లో ఎటువంటి యాడ్స్ ఉండవని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ యాప్‌ను అమెజాన్ యాప్ స్టోర్ అలానే గూగుల్ ప్లే స్టోర్‌లలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Best Mobiles in India

Read more about:
English summary
Messenger Kids is a new app that makes it easier for kids to safely video chat and message with family and friends when they can’t be together in person.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X