Home
Apps

ఫేస్‌బుక్‌కి బానిస అయినవారికి అదిరిపోయే శుభవార్త

పొద్దున లేచింది మొదలు, రాత్రి నిద్రపోయేంతవరకు సోషల్‌ మీడియాకు అందరూ బానిసఅవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా, ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విటర్‌ లాంటి ప్లాట్‌ ఫాంల మీద 24గంటలు గడిపేస్తున్నారు.

పొద్దున లేచింది మొదలు, రాత్రి నిద్రపోయేంతవరకు సోషల్‌ మీడియాకు అందరూ బానిసఅవుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా, ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ట్విటర్‌ లాంటి ప్లాట్‌ ఫాంల మీద 24గంటలు గడిపేస్తున్నారు. ఈ సోషల్‌ మీడియా నుంచి కాస్తయినా బయటపడాలని భావిస్తున్న వారు లేకపోలేదు. అలాంటి వారికోసం సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఒక చక్కటి అవకాశాన్ని అందిస్తోంది. అదే 'యువర్‌ టైం’ అనే ఫీచర్‌. ఈ ఫీచర్‌ ద్వారా రోజుకు ఎంత సమయం ఫేస్‌బుక్‌లో, గడుపుతున్నారో తెలుసుకోవచ్చు.

యాక్టివేట్ ఎలా

యాక్టివేట్ ఎలా

ఈ ఫీచర్‌ను యూజర్లు ఫేస్‌బుక్ యాప్‌లోకి వెళ్లి మోర్ ట్యాబ్‌లో ఉండే సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ విభాగంలో పొందవచ్చు. అక్కడే యువర్ టైం ఆన్ ఫేస్‌బుక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే పైన చెప్పిన విధంగా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

 

 

నిర్ణీత సమయం

నిర్ణీత సమయం

ఫేస్‌బుక్‌లో నిర్ణీత సమయం మాత్రమే గడపాలని కోరుకునే వారు అందుకు అనుగుణంగా ఈ ఫీచర్ సహాయంతో ఫేస్‌బుక్ యాప్‌లో రిమైండర్ సెట్ చేసుకోవచ్చు. దీంతో నిర్దేశిత సమయం ఫేస్‌బుక్‌లో గడపగానే యూజర్‌కు వెంటనే అలర్ట్ వస్తుంది. దాంతో ఫేస్‌బుక్‌ను వాడడం ఆపేయవచ్చు.

 

 

గడిపిన సమయాన్ని

గడిపిన సమయాన్ని

ఇందులో రోజూవారీగా మీరు గడిపిన సమయాన్ని ఇందులో చూసుకోవచ్చు. నిర్ణీత సమయానికి అలర్ట్‌ పెట్టుకొని ఫేస్‌బుక్‌లో మీరు గడిపే సమయాన్ని కంట్రోల్‌ చేసుకోవచ్చు. నిర్ణీత పరిమితి తర్వాత నోటిఫికేషన్లను నిలిపివేసేలా సెట్టింగ్స్‌ను ఏర్పాటు చేశారు.

 

 

ఎంతవరకు ఉపయోగకరం

ఎంతవరకు ఉపయోగకరం

అయితే ఇది ఎంతవరకు ఉపయోగకరం అన్న వాదన కూడా తెరపైకి వస్తోంది. చిన్న నోటిఫికేషన్‌ వస్తే అది తెరిస్తే ఆ సమయాన్ని కూడా ఫేస్‌బుక్‌ గణిస్తుందనీ, ఈ క్రమంలో క్వాలిటీగా గడిపిన సమయాన్ని ఎలా గణిస్తారని టెక్‌ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

 

 

ఏయే విషయాలను చూస్తున్నామో..

ఏయే విషయాలను చూస్తున్నామో..

అయితే ఫేస్‌బుక్‌లో నిత్యం ఎన్ని గంటల పాటు గడుపుతున్నామో తెలుసుకునేందుకు ఆ సంస్థ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది కానీ.. ఫేస్‌బుక్‌లో మనం ఎక్కువగా ఏయే విషయాలను చూస్తున్నామో తెలిపేందుకు మాత్రం ఈ ఫీచర్ ఉపయోగపడదు. అయితే త్వరలోనే ఈ ఫీచర్‌లో ఆ సదుపాయాన్ని కూడా ఫేస్‌బుక్ అందించవచ్చని తెలిసింది.

 

 

 

 

Best Mobiles in India

English summary
Facebook launches 'Your Time' tool to help you with social media addiction More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X