Facebook Messenger కొత్త లోగో డిజైన్ ఇదే!!కొత్త ఫీచర్లు బ్రహ్మాండం...

|

ఫేస్‌బుక్ మెసెంజర్ యొక్క లోగో ఇప్పుడు కొత్త మార్పును అందుకున్నది. ఇది ఇన్‌స్టాగ్రామ్ లాగా కనిపించేలా కొత్త లోగో యొక్క పెద్ద సమగ్రతను అందుకుంది. దీని యొక్క కొత్త డిజైన్ క్రాస్-యాప్ కమ్యూనికేషన్ కోసం మెసెంజర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ విలీనంలో భాగంగా మార్పులను చేయబడింది. కొత్త డిజైన్ తో పాటు మెసెంజర్ చాట్ థీమ్స్, సెల్ఫీ స్టిక్కర్లు మరియు వానిష్ మోడ్‌ను కూడా మార్పులను చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

మెసెంజర్ కొత్త లోగో డిజైన్ వివరాలు

మెసెంజర్ కొత్త లోగో డిజైన్ వివరాలు

మెసెంజర్ యొక్క లోగోలోని కొత్త మార్పులలో పాతదైన మృదువైన నీలం కలర్ ఇక కనిపించదు. మెసెంజర్ యొక్క కొత్త లోగోలో నీలం మరియు పింక్ మిశ్రమంతో కూడిన కలర్ ను ఉపయోగించడం జరిగింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఇన్‌స్టాగ్రామ్ యొక్క లోగోకు దగ్గర పోలికను కలిగి ఉండి ఇన్‌స్టాగ్రామ్ లాగా కనిపిస్తుంది.

Also Read:Amazon, Flipkart saleలో AC,టీవీలను కొంటున్నారా!!! ఇవి గుర్తుంచుకోండి... Also Read:Amazon, Flipkart saleలో AC,టీవీలను కొంటున్నారా!!! ఇవి గుర్తుంచుకోండి...

మెసెంజర్ కొత్త ఫీచర్స్

మెసెంజర్ కొత్త ఫీచర్స్

మెసెంజర్ యొక్క కొత్త లోగోతో పాటు మెసెంజర్ లవ్ మరియు టై-డై వంటి కొత్త చాట్ థీమ్‌లను కూడా మెసెంజర్ అందుకున్నది. ఫేస్‌బుక్ కూడా మెసెంజర్‌కు కస్టమ్ రియాక్షన్స్, సెల్ఫీ స్టిక్కర్లు మరియు వానిష్ మోడ్‌ వంటి ఫీచర్లను విడుదల చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో విలీనంలో భాగంగా ఈ కొత్త ఫీచర్లు మెసెంజర్‌కు వస్తున్నాయి.

మెసెంజర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ విలీనం ఫీచర్స్

మెసెంజర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ విలీనం ఫీచర్స్

మెసెంజర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ రెండూ విలీనం అయినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వానిష్ మోడ్ మరియు కస్టమ్ రియాక్షన్ తో సహా 10 కొత్త మెసేజ్ ఫీచర్ లను అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ‘వాచ్ టుగెదర్', చాట్ కలర్స్, ఫార్వార్డింగ్, రిప్లైస్ మరియు యానిమేటెడ్ మెసేజ్ ఎఫెక్ట్స్ వంటి మెసెంజర్ ఫీచర్లను కూడా అందిస్తున్నది. ఫేస్‌బుక్ విడుదలకు ముందే మెసెంజర్-ఇన్‌స్టాగ్రామ్ విలీనాన్ని పరీక్షించడం ప్రారంభించింది. ఇది Instagram DM లోగోను మెసెంజర్‌తో భర్తీ చేస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్ కొత్త అప్ డేట్

ఇన్‌స్టాగ్రామ్ కొత్త అప్ డేట్

ఫేస్‌బుక్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు కొత్త అప్ డేట్ ను విడుదల చేస్తోంది. ఇది త్వరలో ఉత్తర అమెరికాలోని వినియోగదారులకు అందుబాటులో ఉండాలి. ఈ క్రొత్త అప్ డేట్ భారతదేశంలో ఇంకా అందుబాటులో లేదు. ఇది ప్రస్తుతానికి ఐచ్ఛిక అప్ డేట్ మరియు వినియోగదారులు వారి ఇన్‌స్టాగ్రామ్ యాప్ లో మెసెంజర్‌ను ఏకీకృతం చేయకుండా ఉండడానికి ఎంచుకోవచ్చు.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook Messenger Changed Logo Design!! New Update Features are Here

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X