ఫేస్‌బుక్ కొత్త యాప్ ‘మెసెంజర్ లైట్’

Messenger Lite పేరుతో సరికొత్త యాప్‌ను ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకువచ్చింది. రెగ్యులర్ మెసెంజర్ యాప్‌కు ఇది లైటర్ వర్షన్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒరిజినల్ మెసెంజర్ యాప్‌కు ఇది లైటర్ వర్షన్..

మెసెంజర్ లైట్ యాప్ స్లో ఇంటర్నెట్ కనెక్షన్‌లలోనూ పనిచేస్తుంది. ఒరిజినల్ మెసెంజర్ యాప్‌లో ఉండే అన్ని కోర్ ఫీచర్స్ ఈ లైటర్ వర్షన్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

యాప్ సైజ్ కేవలం 5MB..

ముఖ్యంగా స్లో ఇంటర్నెట్ కనెక్షన్ అలానే లో-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో వచ్చే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ యాప్ బాగా సూట్ అవుతుంది. గూగుల్ ప్లే స్లోర్‌లో అందుబాటులో ఉన్న ఈ యాప్ సైజ్ కేవలం 5MB.

అన్ని రకాల సదుపాయాలు..

ఈ లైట్‌వెయిట్ యాప్‌ చాలా వేగంగా ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఒరిజినల్ మెసెంజర్ యాప్ తరహాలోనే మెసెంజర్ లైట్ యాప్ ద్వారా మెసేజెస్, ఫోటోస్, లింక్స్, emojis ఇంకా స్టిక్కర్స్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ వాయిస్ కాల్స్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

భారత్‌తో సహా అనేక దేశాల్లో

భారత్‌తో సహా వియత్నాం, నైజీరియా, పెరు, టర్కీ, జర్మనీ, జపాన్ మరియు నెదర్లాండ్స్ దేశాల్లో మెసెంజర్ లైట్ యాప్ అందుబాటులో ఉంటుంది.

2015లో ఫేస్‌బుక్ లైట్ యాప్‌

లైటర్ వర్షన్ యాప్‌లను రిలీజ్ చేయటం ఫేస్‌బుక్‌కు ఇది మొదటిసారేమి కాదు. 2015లో రెగ్యులర్ ఫేస్‌బుక్ యాప్‌కు లైటర్ వర్షన్‌గా ఫేస్‌బుక్ లైట్ యాప్‌ను కంపెనీ లాంచ్ చేసింది.

యాప్ సైజ్ 1MB కంటే తక్కువే...

మెసెంజర్ లైట్ తరహాలోనే ఈ యాప్ కూడా స్లో ఇంటర్నెట్ కనెక్షన్ అలానే లో-ఎండ్ స్పెసిఫికేషన్‌లతో వచ్చే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు బాగా సూట్ అవుతుంది. ఈ యాప్ సైజ్ 1MB కంటే తక్కువగానే ఉంటుంది.

150కు పైగా దేశాల్లో...

150కు పైగా దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను 55 భాషల్లో ఉపయోగించునే వీలుంటుంది. ఫేస్‌బుక్ లైట్ యాప్‌ను వినియోగించుకునే యూజర్ల సంఖ్య తాజాగా 200 మిలియన్ మార్కును దాటింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Facebook Messenger Lite app launched in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot