యువతే లక్ష్యంగా మరో సరికొత్త ఫీచర్‌ను షేస్‌బుక్ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ ఆకర్షణీయ ఫీచర్‌ను స్నాప్‌చాట్ 'స్ట్రీక్స్’కు పోటీగా నుంచి ఫేస్‌బుక్ అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ మెసెంజర్‌లో అందుబాటులో ఉండే ఈ ఫీచర్ చాటింగ్‌ను కొత్త లెవల్‌కు తీసుకువెళ్లనుందట.
స్నాప్‌చాట్ తరహా స్ట్రీక్స్ ఫీచర్ ఒకటి తన మెసెంజర్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించిందని పలువురు ఫేస్‌బుక్ మెసెంజర్ యూజర్లు ఇప్పటికే ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేయటం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ ఫేజ్‌లో ఉండటంతో సెలక్టెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తోంది.
ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే..?
ఉదాహరణకు మీరు ఒకే వ్యక్తితో రెండు రోజుల నుంచి కంటిన్యూగా చాటింగ్ చేస్తున్నట్లయితే ఓ లైట్నింగ్ బోల్ట్ ఎమోజి (మెరిసే బోల్ట్‌లా కనిపించే ఎమోజి) ఒకటి స్ర్కీన్ పై పాపప్ అవుతుంది. ఇలా వస్తే మీరు స్ట్రీక్‌లో ఉన్నట్లు భావించాలి. ఈ స్ట్రీక్‌ను కంటిన్యూ చేయాలంటే ఆ వ్యక్తితో రోజు చాటింగ్ కంటిన్యూ చేస్తుండాలి.
ఇంటర్నెట్ స్లోగా ఉందన్న సంగతి మరచిపోండి..
ఇదే తరహా ఉద్దేశ్యంతో వర్క్ అవుతోన్న స్నాప్‌చాట్ 'స్ట్రీక్స్’ ఫీచర్ ఇప్పటికే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. బిజినెస్ పీపుల్‌తో పాటు టీనేజర్స్‌కు ఈ ఫీచర్ బాగా కనెక్ట్ అవుతుందని మార్కెట్లో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో పూర్తిస్తాయిలో మెసెంజర్ యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.