మెసేంజర్‌లోకి అదిరిపోయే ఫీచర్ వచ్చింది

Written By:

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఫేస్‌బుక్ మెసెంజర్‌ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్‌ను అందించింది. ఆ యాప్‌లో ఇకపై యూజర్లు 360 డిగ్రీ ఫొటోలు, పనోరమిక్ ఫొటోలు, హెచ్‌డీ వీడియోలను నేరుగా సెండ్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా iOS, Android వాడుతున్న యూజర్లందరూ మెసేంజర్ లో 360 డిగ్రీ ఫోటోలు పంపుకోవచ్చు. కాగా HD quality videos మాత్రం Australia, Belgium, Britain, Canada, Denmark, Finland, France, Hong Kong, Japan, Netherlands, Norway, Romania, Singapore, South Korea, Sweden, Switzerland, Taiwan, US లాంటి దేశాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలను 720పి క్వాలిటీతో యూజర్లు పంపుకునేందుకు వీలుంటుంది. క్వాలిటీ ఏమాత్రం తగ్గిపోదు. మెసెంజర్‌లో 360 డిగ్రీ ఫొటోలను పంపాలంటే ఫోన్ కెమెరాను పనోరమా మోడ్‌లో సెట్ చేయాలి. అనంతరం ఫొటో తీసి దాన్ని నేరుగా మెసెంజర్‌లో షేర్ చేసుకోవచ్చు. లేదంటే అంతకు ముందు ఆల్రెడీ తీసిన అలాంటి ఫొటోలు ఉన్నా వాటిని నేరుగా మెసెంజర్‌లో పంపుకోవచ్చు.

స్నాప్‌చాట్‌లోకి కొత్త ఫీచర్, ఒకేసారి 16 మందితో వీడియో చాట్

మెసేంజర్‌లోకి అదిరిపోయే ఫీచర్ వచ్చింది

ఇలాగే హెచ్‌డీ వీడియోలను కూడా యూజర్లు మెసెంజర్‌లో పంపుకోవచ్చు. ఫేస్‌బుక్ మెసెంజర్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై మెసెంజర్ యాప్‌ను వాడుతున్న యూజర్లు ప్రస్తుతం ఉపయోగించుకోవచ్చు.

కాగా ఫేస్ బుక్ లోని వచ్చిన photos, videos, stickers and GIFsని నేరుగా మెసేంజర్ లోని వ్యక్తులకు షేర్ చేసుకునే ఫీచర్ మీద కంపెనీ కసరత్తులు చేస్తోంది. ఈ కొత్త ఫీచర్లను మెసేంజర్ యాప్ లేటెస్ట్ వర్షన్ అప్ డేట్ చేసుకోవడం ద్వారా యూజర్లు పొందవచ్చు. ఒక్క మెసేజ్ ద్వారా యూజర్లు ఈ వీడియోలను పంపుకునే అవకాశం ఉంది.

English summary
Facebook Messenger now lets you send 360-degree photos and HD video More News at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot