ఫేస్‌బుక్ మెసేజ్‌లను వెనక్కి తీసుకునేందుకు "Unsend"
సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌ను ఉద్దేశించి ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. "Unsend" పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందట.
సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తన మెసెంజర్ యాప్‌ను ఉద్దేశించి ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. "Unsend" పేరుతో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందట. ఈ కొత్త ఆప్షన్‌తో రీసెంట్‌గా సెండ్ చేసిన మెసేజెస్‌ను ఇన్‌బాక్స్ నుంచే కాకుండా చాట్ త్రెడ్ నుంచ రీట్రాక్ట్ (ఉపసంహరించుకునే) వీలుంటుందట. టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌కు మరిన్ని మెరుగులను దిద్దుతోంది.

లీకైన ప్రోటోటైప్ స్క్రీన్ షాట్స్..
ఫేస్‌బుక్ అన్‌సెండ్ బటన్‌కు సంబంధించిన ప్రోటోటైప్ స్క్రీన్ షాట్‌లను ప్రముఖ మొబైల్ రిసెర్చర్ అలానే టిప్‌స్టర్ జేన్ మంచూన్ వాంగ్ రివీల్ చేసారు. మెసెంజర్ ఆండ్రాయిడ్ కోడ్ నుంచి వీటిని జనరేట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కోడ్ సూచిస్తోన్న దాని ప్రకారం ప్రస్తుత ప్రోటోటైప్‌లో 'time limit'ను ఫేస్‌బుక్ ఫిక్స్ చేసింది. దీని ప్రకారం నిర్ణీత సమయంలోపే మెసేజ్‌ను అన్‌సెండ్ చేసుకునే వీలుంటుంది. ఫేస్‌బుక్ నేతృత్వంలోని ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటికే ఈ తరహా సదుపాయాన్ని ఆఫర్ చేస్తోంది. ఇదే సమయంలో స్నాప్‌చాట్ వంటి యాప్స్ కూడా అన్‌సెండ్ ఫీచర్‌ను తమ యూజర్లకు అందిస్తున్నాయి.

వీడియో కాలింగ్ కోసం కొత్త డివైసెస్..
వీడియో కాలింగ్ అనుభూతులను సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో అందించే క్రమంలో ఫేస్‌బుక్, రెండు సరికొత్త వీడియో కాలింగ్ డివైస్‌లను మార్కెట్లో అనౌన్స్ చేసింది. పోర్టల్, పోర్టల్ ప్లస్ పేర్లతో ఈ ఏఐ ఆధారిత స్మార్ట్ స్పీకర్ డివైసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ డివైసెస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థ యూజర్స్ వీడియో చాటింగ్‌ను సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆఫర్ చేస్తుంది.

డివైసెస్ టాబ్లెట్స్ తరహాలో ఉంటాయి..
ఈ రెండు డివైసెస్ టాబ్లెట్స్ తరహాలో ఉంటాయి. వీటిలో మొదటి మోడల్ అయిన పోర్టల్ 10 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ధర 199 డాలర్లు. ఇక రెండవ మోడల్ అయిన పోర్టల్ ప్లస్ 15 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ధర 349 డాలర్లు. ఇండియన్ మార్కెట్లో వీటి అందుబాటుకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

మరిన్ని సర్వీసులు యాడ్ అయ్యే అవకాశం..
ఈ వీడియో కాలింగ్ డివైసెస్‌లో స్పాటిఫై, పాండోరా, ఐహార్ట్‌రేడియో, ఫేస్‌బుక్ వాచ్, ఫుడ్ నెట్‌వర్క్, స్ర్కిప్స్ న్యూసీ వంటి సర్వీసెస్ ముందస్తుగానే లోడై ఉంటాయని కంపెనీ తెలిపింది. త్వరలోనే మరిన్ని సర్వీసులను ఇందులో యాడ్ చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి స్ట్రీమింగ్ ఆప్షన్స్ ఈ వీడియో కాలింగ్ డివైసెస్‌లో మిస్ అయ్యాయి.

స్నాప్‌చాట్ తరహా ఎఫెక్ట్స్...
ఈ డివైసెస్ ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నపుడు స్నాప్‌చాట్ తరహా ఎఫెక్ట్స్‌ను అద్దుకునే వీలుంటుంది. ఇదే సమయంలో డివైసైస్‌లోని స్పాటిఫై, ఐహార్డ్ రేడియో, పాండోరా వంటి ఇన్‌బిల్ట్ ఫీచర్స్‌ను ఉపయోగించుకుని మ్యూజిక్‌ను షేర్ చేసకునే వీలుంటుంది. పోర్టల్ డివైస్‌లో లోడ్ చేసిన స్టోరీ టైమ్ ఫీచర్ ద్వారా మంచి మంచి ఈ-బుక్స్‌ను చదువుకునే వీలుంటుంది.


Click it and Unblock the Notifications








