ఫేస్‌బుక్ నుంచి సరికొత్త ఫీచర్!

By Madhavi Lagishetty
|

వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లను సొంతం చేసుకున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మరో సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ఫేస్‌బుక్ యాప్, వెబ్ సైట్ నుంచి యూజర్లు తమకు నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ చేసే అవకాశం కల్పించింది. ఈ సేవలు ఇప్పటికే అమెరికాలో అందుబాటులోకి వచ్చాయి.

 
ఫేస్‌బుక్ నుంచి సరికొత్త ఫీచర్!

ఈ సరికొత్త ఫీచర్ కోసం ఫేస్‌బుక్ డెలివరీ.కామ్ వంటి ఫుడ్ ఆర్డరింగ్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. గతేడాది నుంచే ఈ ఫీచర్‌ను టెస్ట్ చేసిన ఫేస్‌బుక్ ....సానుకూల అభిప్రాయం రావడంతో ఈ ఫీచర్ను యాడ్ చేసింది. అమెరికాలో ఫేస్‌బుక్ ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ మరియు డెస్క్ టాప్ తోపాటు ప్రతిచోటా ఫుడ్ ఆర్డరింగ్ ఫీచర్లను రోలింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ ఇతర దేశాల్లో ఎప్పుడు అందుబాటులో ఉంటుందన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.

అమెరికాలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం, ఈట్ స్ట్రీట్, డెలివరీ.కామ్, డోర్ డాష్, చౌనౌ మరియు ఓలో ఫుడ్ ఆర్డరింగ్ సర్వీస్ను అందిస్తున్నాయి. అదేవిధంగా జాక్ ఇన్ ది బాక్స్, ఫైవ్ గైస్, పాపా జాన్స్ , పనేరా వంటి రెస్టారెంట్లు కూడా ఈ ఫీచర్‌ను వాడుకుంటున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో మరోకొత్త ఫీచర్!ఇన్‌స్టాగ్రామ్‌లో మరోకొత్త ఫీచర్!

లోకల్ నుంచి నేషనల్ వరకు అనేక రెస్టారెంట్ల నుంచి వినియోగదారులు ఫుడ్ ఆర్డర్ చేసే సదుపాయాన్ని ఫేస్‌బుక్ కల్పించింది. నచ్చిన హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్చించుకోవచ్చు.

అంతేకాదు సెర్చ్ మెనూలో ఫేస్‌బుక్ కొత్తగా ఆర్డర్ ఫుడ్ సెక్షన్ను కూడా యాడ్ చేసింది. యూజర్లు సమీపంలోని రెస్టారెంట్ల నుంచి తమకు ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకునేందుకు ఆప్షన్స్ కోసం కూడా బ్రౌజ్ చేయవచ్చు. దీనికోసం యూజర్లు స్టార్ట్ ఆర్డర్ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. మల్టిపుల్ సేవలతో రెస్టారెంట్ టేక్ అవుట్ డెలివరీని అందిస్తే...యూజర్లు వారి ప్రాధాన్యత సర్వీస్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు.

ఫుడ్ ఆర్డర్ సర్వీస్‌తో ఎవరైన అకౌంట్ కలిగి ఉంటే...వారు ఈజీగా ప్రస్తుతం ఉన్న లాగిన్ ఐడితో ఆర్డర్ చేయోచ్చు. లేదా ఫేస్‌బుక్ యాప్‌ను సైన్ అప్ చేయకుండా ఈజీగా ఆర్డర్ చేసే అవకాశాన్ని ఫేస్‌బుక్ కల్పించింది.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook is currently rolling out this feature everywhere in the US on iOS, Android and desktop.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X