టిక్‌టాక్, యూట్యూబ్ తరహాలో ఫేస్‌బుక్ వీడియో ప్లేయర్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?
మెటా నేతృత్వంలోని ఫేస్ బుక్ పుల్ స్క్రీన్ వీడియో (Facebook Video player) అనుభూతిని మరింత మెరుగుపరిచేందుతు వీడియో ప్లేయర్‌ను విడుదల చేస్తోంది. ఫలితంగా రీల్స్, వీడియోలు, లైవ్ కార్యక్రమాలు చూస్తున్న సమయంలో మెరుగైన అనుభూతిని పొందవచ్చని తెలుస్తోంది. ఫేస్ బుక్ యాప్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు ఈ వీడియో ప్లేయర్ పనితీరును అస్వాదించవచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే టిక్‌టాక్ ఈ తరహా వీడియో ప్లేయర్ (Tiktok Video Player) ను కలిగి ఉంది. అనంతరం రీల్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్ మరియు షార్ట్ కోసం యూట్యూబ్ ఈ వీడియో ఫార్మాట్‌ను కలిగి ఉన్నాయి. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా ఫేస్ బుక్ అల్గారిథం ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను సిఫార్సు చేస్తుంది. ఈ కొత్త వీడియో ప్లేయర్ ద్వారా మెరుగైన విజువల్ అనుభూతిని పొందవచ్చు. యూజర్ల అవసరాలు మరియు అభిరుచికి అనుగుణంగా వీడియోలు ప్లే కానున్నాయి.

వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా..
మరిన్ని వారాల్లో ఈ వీడియో ప్లేయర్‌లో మరిన్ని ఫీచర్లు, నియంత్రణలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితంగా యూజర్ల విజువల్ అనుభూతి మరింత మెరుగవుతుందని భావిస్తోంది. ఈ కొత్త వీడియో ప్లేయర్ ద్వారా వెర్టికల్ ఫార్మాట్‌లో వీడియోలు ప్లే కానున్నాయి. యూజర్లు ల్యాండ్ స్కేప్ మోడ్‌లోనూ పుల్ స్క్రీన్ ఫార్మాట్ వీడియోలను వీక్షించవచ్చు.
మెరుగైన నావిగేషన్ బార్ :
దీంతోపాటు ఈ ఫేస్ బుక్ వీడియో ప్లేయర్ కింద వైపు నావిగేషన్ వద్ద మెరుగైన నియంత్రణ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా యూజర్ల తమకు నచ్చిన కంటెంట్‌కు సులభంగా మారవచ్చు. మరియు ముందుకు, వెనక్కి 10 సెకన్ల చొప్పున వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఫార్వడింగ్ సదుపాయం కూడా ఉంది.
వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ సిఫార్సు :
ఫేస్ బుక్ యాప్‌లోని ఫీడ్, వీడియో ట్యాబ్‌లో (Facebook Video Feed and Tab) వినియోగదారులు ఆసక్తి చూపిన లేదా సంబంధించిన కంటెంట్‌ను సిఫార్సు చేస్తుంది. దీంతోపాటు మరిన్ని రీల్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే ఈ వీడియో ప్లేయర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో ఫేస్ బుక్ వెల్లడించింది.
ఫేస్ బుక్ వీడియో ప్లేయర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది ?
ఈ పుల్ స్క్రీన్ వీడియో ప్లేయర్ తొలుత అమెరికాలోని iOS మరియు ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని తన బ్లాగ్‌లో తెలిపింది. మరికొన్ని నెలల్లో ఈ వీడియో ఫీచర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని ఫేస్ బుక్ వెల్లడించింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications