ఫేస్‌బుక్ నుండి సరికొత్త వీడియో యాప్ Lasso, పూర్తి వివరాలు ఇవే
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రతీసారి సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ పోతోంది.
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ప్రతీసారి సరికొత్త ఫీచర్లతో యూజర్లను అలరిస్తూ పోతోంది. కొత్త కొత్తగా ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ మరింతగ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు శర వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అభిమానుల కోసం lasso పేరుతో సరికొత్త వీడియో యాప్ ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ వీడియో యాప్ ద్వారా చిన్న చిన్న వీడియోలను మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆ వీడియోకి పిల్టర్స్, స్పెషల్ ఎఫెక్ట్ లను ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో యాప్ అత్యంత తక్కువ నిడివి గల వీడియోలకు మాత్రమే సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది..

lasso యాప్...
lasso యాప్ ముందుగా యుఎస్ లో అందుబాటులో ఉంటుందని Facebook Product Manager Andy Huang తన ట్విట్టర్ పేజీలో తెలిపారు. అయితే ఈ యాప్ పో సోషల్ మీడియా దిగ్గజం Facebook మాట్లాడేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండానే దీనిని లైవులోకి తెచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఈ వీడియో యాప్ ద్వారా యూజర్లు...
ఈ వీడియో యాప్ ద్వారా యూజర్లు తమ వీడియోని ఎడిటింగ్ చేసుకునేందుకు చిన్న చిన్న టూల్స్ ని అందుబాటులో ఉంచారు. ఈ టూల్స్ ద్వారా మీరు నచ్చిన టెక్ట్స్, అలాగే మ్యూజిక్ లాంటి వాటిని వీడియోకి జత చేసుకోవచ్చు.

లస్సో అనేది న్యూ స్టాండ్ లోన్ యాప్....
లస్సో అనేది న్యూ స్టాండ్ లోన్ యాప్ అని అత్యంత వేగంగా తక్కువ సమయంలో తక్కువ నిడివి గల వీడియోలను నచ్చిన విధంగా ఎడిటింగ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చని దీనిపై యూజర్ల నుంచి ఎటువంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో అనేదానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని CNET కోట్ చేసింది. ఈ మేరకు Facebook స్పోక్ పర్న్ ఈ మెయిల్ పంపాడని తెలిపింది.

Facebook వీడియోలు అన్నీ పబ్లిక్ పరంగానే ఉంటాయి....
కాగా Facebook వీడియోలు అన్నీ పబ్లిక్ పరంగానే ఉంటాయి. ఈ సారి మాత్రం కేవలం యుఎస్ లోనే దీనిపై ప్రయోగాలు నిర్వహిస్తోంది. అక్కడ ఇది విజయవంతమయితే మిగతా దేశాలకు దీన్నితీసుకొచ్చే అవకాశం ఉంది . ఈ యాప్ పూర్తి స్థాయిలో లైవులోకి వస్తే యూట్యూబ్, స్నాప్ చాట్ లకు పోటీ వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

యుఎస్ లో దాదాపు 69 శాతం మంది యూత్....
కాగా యుఎస్ లో దాదాపు 69 శాతం మంది యూత్ స్నాప్ చాట్, 72 శాతం మంది ఇన్ స్టా గ్రామ్, 85 శాతం మంది యూట్యూబ్ వాడుతున్నట్లుగా రిపోర్టులు చెబుుతన్నాయి. రానున్న ఈ యాప్ iOS and Android ఫ్లాట్ ఫాం మీద అందుబాటులో ఉండనుంది.


Click it and Unblock the Notifications








