Home
Apps

ఫేస్‌బుక్ కొత్త ఫీచర్

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, "Watch Party" పేరుతో సరికొత్త ఫీచర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

By Gizbot Bureau

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, "Watch Party" పేరుతో సరికొత్త ఫీచర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఫేస్‌బుక్ గ్రూప్‌లలోని యూజర్లు వీడియోలను రియల్ టైమ్‌లో వీక్షిస్తూ కామెంట్స్ చేసుకునే వీలుంటుంది. 6 నెలల టెస్టింగ్ తరువాత ఈ ఫీచర్‌ను అఫీషియల్‌గా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. వీడియో స్ట్రీమింగ్ విభాగంలో మరింత దూకుడుతో ముందుకెళ్లే లక్ష్యంతో గూగుల్ యూట్యూబ్‌కు ధీటుగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది.

వీడియో చూస్తూ కామెంట్స్ చసుకునే వీలు..

వీడియో చూస్తూ కామెంట్స్ చసుకునే వీలు..

వాచ్ పార్టీ స్టార్ట్ అయిన వెంటనే గ్రూపు సభ్యులందరూ ఆ లైవ్ లేదా రికార్డెడ్ వీడియోను వీక్షిస్తూ పరస్పరం కామెంట్స్ చసుకునే వీలుంటుందని ఫేస్‌బుక్ ప్రొడక్ట్ మేనేజర్ ఎరిన్ కొన్నోల్లీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఫీచర్‌ను ఉపయోగించు కోవాలనుకునే యూజర్లు ముందుగా ఫేస్‌బుక్‌లో వీడియో‌ను సెర్చ్ చేసుకుని, ఆ తరువాత వీడియోను వీక్షించేందుకు గ్రూపులోని ఇతర సభ్యులను ఇన్వైట్ చేయవల్సి ఉంటుంది.

చాట్ విండో కూడా స్క్రీన్  పై ప్రత్యక్షమవుతుంది ...

చాట్ విండో కూడా స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది ...

ఈ వీడియో ప్లే అవుతున్నప్పుడు గ్రూప్ సభ్యులు చాట్ చేసుకునేందుకు వీలుగా ఓ చాట్ విండో కూడా స్క్రీన్ పై ప్రత్యక్షమవుతుంది . ఈ ఫీచర్‌తో మరో రెండు కొత్త ఫీచర్లను కూడా ఫేస్‌బుక్ అనౌన్స్ చేసింది. వాటిలో కో-హోస్టింగ్ ఫీచర్ ఒకటి కాగా మరొకటి క్రౌడ్‌సోర్సింగ్ ఫీచర్. కో-హోస్టింగ్ ఫీచర్ ద్వారా వీడియోను వీక్షిస్తున్నప్పుడు గ్రూపులోని ఇతర సభ్యులు కూడా కో-హోస్ట్‌గా మారి మరిన్ని వీడియోలను యాడ్ చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్లవచ్చు.

 

 

క్రౌడ్ సోర్సింగ్ ఫీచర్ ద్వారా..

క్రౌడ్ సోర్సింగ్ ఫీచర్ ద్వారా..

క్రౌడ్ సోర్సింగ్ ఫీచర్ ద్వారా గ్రూపులోని సభ్యులు కొత్త కొత్త వీడియోలను సజెస్ట్ చేయవచ్చు. "Watch Party" ఫీచర్ ను ఫేస్ బుక్ గ్రూపులకు మాత్రమే పరిమితం చేయకుండా ఇతర పేజీలకు కూడా అందుబాటులో ఉంచాలని ఫేస్ బుక్ భావిస్తోంది.

 

 

 

కమ్యూనికేషన్ వ్యవస్థలో సరికొత్త శకం..

కమ్యూనికేషన్ వ్యవస్థలో సరికొత్త శకం..

ఆధునిక యువత జీవితాల్లోకి శరవేగంగా విస్తరించిన ఫేస్‌బుక్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సరికొత్త అధ్యయానానికి నాంది పలికింది. ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నెటిజనులు దాసోహమంటున్నారు. చిన్ననాటి స్నేహితులు మొదలుకుని పెద్ద వయసు ప్రాణ స్నేహితుల వరకు ఫేస్‌బుక్ చాటింగ్‌లలో మునిగితేలుతున్నారు.

 

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఫేస్‌‌బుక్ గ్రూప్ మెసెజెస్ సెండ్ చేయాలంటే..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఫేస్‌‌బుక్ గ్రూప్ మెసెజెస్ సెండ్ చేయాలంటే..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్‌‌బుక్ యాప్‌లో గ్రూప్ మెసెజ్‌ను స్టార్ట్ చేయాలంటే ముందుగా యాప్‌ను ఓపెన్ చేసి మెసెజ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపన్ అయ్యే మెనూలో Group ఆప్సన్‌ను సెలక్ట్ చేసుకుని కావల్సిన మిత్రులకు గ్రూప్‌లోకి యాడ్ చేసుకుని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయండి.

 

 

 

Best Mobiles in India

English summary
Facebook Rolls Out Watch Party Feature, Letting People Watch Videos Together.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X