ఫేస్‌బుక్ నోటిఫికేషన్లతో విసుగొస్తోందా ..? ఈ కొత్త ఫీచర్ ట్రై చేయండి

|

స్మార్ట్‌ఫోన్‌లలో ప్రతిరోజూ ఫేస్‌బుక్ నుండి అనేక నోటిఫికేషన్‌లు వస్తూఉంటాయి. మీ చుట్టూ ఉండే సామాజిక వృత్తంలో ఏమి జరుగుతుందో అందరికి తెలియజేయడానికి ఫేస్‌బుక్ ద్వారా చెప్పవచ్చు మరియు తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు సాధారణ పింగ్‌లు మరియు నోటిఫికేషన్‌లు బాధిస్తూ ఉంటాయి. అందుకే సోషల్ మీడియా దిగ్గజం సత్వరమార్గంగా నావిగేషన్ బార్ సెట్టింగులు అనే కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.

ఫేస్‌బుక్
 

ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండింటిలోని వినియోగదారులందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోందని ఫేస్‌బుక్ న్యూస్ వెబ్‌సైట్ ధృవీకరించింది. ప్రజలు తమకు నచ్చిన విషయాలతో సులభంగా కనెక్ట్ అవ్వడానికి మరియు ఫేస్‌బుక్ యాప్ లో వారికి లభించే నోటిఫికేషన్‌లను నియంత్రించడానికి నావిగేషన్ బార్ కంట్రోల్ ను రూపొందిస్తున్నాము అని ఫేస్‌బుక్ యొక్క ప్రతినిధి తెలిపారు.

షియోమి 43-inch స్మార్ట్‌టీవీ ఫ్లాష్ సేల్...తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్ లో

కొత్త ఫీచర్

ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు వాచ్ గ్రూపులు, మార్కెట్ ప్లేస్, ప్రొఫైల్, ఈవెంట్స్, న్యూస్, ఫ్రెండ్ రిక్వెస్ట్స్, టుడే ఇన్, గేమింగ్ మరియు డేటింగ్ వంటి కొన్ని ట్యాబ్‌లను తొలగించవచ్చు లేదా వారి నోటిఫికేషన్ లను మ్యూట్ చేయవచ్చు. దీని కారణంగా ఫేస్‌బుక్‌ యొక్క పరధ్యానం తక్కువగా ఉండేలా చేస్తుంది.

టాటా స్కై బంపర్ ఆఫర్!! తక్కువ ధరకు మెట్రో ప్యాక్‌లు

షార్ట్ కట్ బార్ సెట్టింగ్స్

టెక్ క్రంచ్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం ఇందులో షార్ట్ కట్ బార్ సెట్టింగ్స్ యొక్క ఐకాన్స్ హోమ్, నోటిఫికేషన్లు, ఫ్రెండ్ రిక్వెస్ట్ వంటి మరిన్ని ఇతర ఐకాన్లతో పాటు చూడవచ్చు. మీకు రాబోయే నోటిఫికేషన్లను చూడటం మరియు మీ దగ్గర ఇతరులను కనుగొనడం వంటి మీరు ఎక్కువగా చేసే పనులకు ఇప్పుడు మీకు షార్ట్ కట్లు ఉన్నాయి అని డిస్క్రిప్షన్ బాక్స్ పేర్కొంది.

Fake Passport Website: పాస్‌పోర్ట్ నకిలీ వెబ్‌సైట్లతో జాగ్రత్త!!!

ఫేస్‌బుక్ యాప్
 

మీరు ఇప్పటికే మీ ఫేస్‌బుక్ యాప్ లో షార్ట్ కట్ బార్ సెట్టింగులను కలిగి ఉంటే కనుక మీరు నావిగేషన్ బార్‌లోని ఏదైనా షార్ట్ కట్లను నొక్కడం ద్వారా వీటిని ఉపయోగించవచ్చు. ఇది iOSలోని ఫోన్లలో దిగువవైపున మరియు ఆండ్రాయిడ్ ఫోన్లలోని యాప్ లో ఎగువన ఉంటుంది. ఈ ఫీచర్ ను పొందడానికి మూడు-లైన్ల ద్వారా యాక్సిస్ చేయవచ్చు. అవి వరుసగా టాబ్> సెట్టింగులు & ప్రైవసీ > సెట్టింగులు> షార్ట్ కట్ పద్ధతులు పాటించడం వలన దీనిని యాక్సెస్ చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Facebook's New Shourtcut Bar Feature Now Controls Notifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X