ఫేస్‌బుక్‌లో రెండు రకాల పేజీలు

Posted By: BOMMU SIVANJANEYULU

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, తన ప్లాట్‌ఫామ్‌లో భారీ మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టింది.
ఫేస్‌బుక్‌లో వచ్చే న్యూస్ ఫీడ్‌ను రెండు పేజీలుగా విభజించి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. దీంతో యూజర్లు తమ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి లాగిన్ అయిన వెంటనే స్ర్కీన్ పై రెండు రకాల పేజీలను చూడగలుగుతారు. అందులో ఒకటి కమర్షియల్ న్యూస్ ఫీడ్ పేజీగా, మరొకటి పర్సనల్ న్యూస్ ఫీడ్ పేజీ.

ఫేస్‌బుక్‌లో రెండు రకాల పేజీలు

పర్సనల్ న్యూస్ ఫీడ్ పేజీలో యూజర్ ఫ్రెండ్స్‌కు సంబంధించిన వ్యక్తిగత పోస్టులు మాత్రమే కనిపిస్తాయి. ఇక కమర్షియల్ న్యూస్ ఫీడ్ పేజీలో పెయిడ్ కంటెంట్‌కు సంబంధించిన పోస్టులు కనిపిస్తాయి. ఈ స్ప్లిట్ న్యూస్ ఫీడ్ అప్‌డేట్‌ను ప్రస్తుతానికి శ్రీలంక, బొలివియా, స్లొవేకియా, సెర్బియా, గ్వాటెమాలా ఇంకా కంబోడియా దేశాల్లో ఫేస్‌బుక్ పరీక్షిస్తోంది.

నోకియా ఫోన్లకు ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్ !

ఈ అప్‌డేట్ తరువాత, న్యూస్ ఫీడ్ అనేది ఫేస్‌బుక్ మెయిన్ ల్యాండింగ్ పేజ్ క్రిందకు వచ్చింది. యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా యూజర్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అయిన ప్రతిసారి రీసెంట్ పోస్టులతో పాటు టార్గెటెడ్ అడ్వర్‌టైజింగ్ కంటెంట్‌ను ఒకేసారి చూడగలుగుతారు.

టెలికం వ్యాపారానికి అనిల్ అంబాని గుడ్‌బై, తరువాత వ్యూహం ఇదే !

ఫేస్‌బుక్ లాంచ్ చేసిన స్ప్లిట్ న్యూస్ ఫీడ్ అప్‌డేట్‌ పై ఆయా దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్లోవేకియన్ జర్నలిస్ట్ ఫిలిప్ స్ట్రుహరిక్ ఈ ఫీచర్ పై ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్ ఈ అప్‌డేట్‌ను లాంచ్ చేసిన నాటి నుంచి పేజీలకు సంబంధించిన ఆర్గానిక్ రీచ్ భారీగా డ్రాప్ అవుతోందని ఫిలిప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇటువటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ట్రెయిల్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ ఏ విధంగా ముందుకు తీసుకువెళుతుందో వేచి చూడాలి.

ఫేస్‌బుక్ యాప్‌ను రోజుకు 100 కోట్లకు పైగా యూజర్లు వినియోగించుకుంటున్నారు. లేటెస్ట్ న్యూస్ దగ్గర నుంచి హాటెస్ట్ గేమ్స్ వరకు, వీడియో కాల్స్ దగ్గర నుంచి వాయిస్ కాల్స్ వరకు, చాటింగ్ దగ్గర నుంచి డేటింగ్ వరకు అన్ని కార్యకలాపాలాను ఫేస్‌బుక్ ద్వారానే ఈ కాలం యువత నిర్వహించుకువటం జరుగుతోంది.

జియోని టార్గెట్ చేసిన Airtel, కౌంటర్‌కి రీకౌంటర్ !

నచ్చిన వ్యక్తులకు సంబంధించిన న్యూస్‌ ఫీడ్ ముందుగా కనిపించాలంటే..?

ఫేస్‌బుక్ మొబైల్ యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే మీకు నచ్చిన వ్యక్తులు లేదా పేజీలకు సంబంధించిన న్యూస్ ఫీడ్ ముందుగా కనిపించాలా..? అయితే యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి "More" టాబ్ ను సెలక్ట్ చేసుకున్నట్లయితే "News Feed Preferences" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఇందులో మీకు నచ్చిన వ్యక్తులు లేదా పేజీలను మార్క్ చేసుకున్నట్లయితే వారికి సంబంధించి న్యూస్ ఫీడ్స్ మీకు ముందుగా కనిపిస్తాయి.

English summary
Facebook is now testing the idea of dividing its News Feed in two, separating commercial posts from personal news.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot