యూట్యూబ్ కు చుక్కలు చూపించనున్న ఫేస్ బుక్!

By: Madhavi Lagishetty

లేచింది మొదలు...మన జీవితాల్లో ఒక భాగమైంది ఫేస్ బుక్. అయితే ఫేస్ బుక్ జనాలకు మరింత చేరువయ్యుందుకు ఫేస్ బుక్ టీవీ కూడా త్వరలోనే రానుంది. రానున్న జూన్ లో టీవీ షోలను ప్రసారం చేసేందుకు హాలీవుడ్ స్టూడియోస్ తో ఫేస్ బుక్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ వేసవిలోనే ఫేస్ బుక్ ప్రొగ్రామ్స్ ను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్ కు చుక్కలు చూపించనున్న ఫేస్ బుక్!

బ్లూమ్బెర్గ్ ఆగస్టులో ఫేస్ బుక్ టీవీ వస్తున్నట్లు పేర్కొంది. స్పాట్ లైట్ల్ షోలలోని మొదటి ఎపిసోడ్స్ లను సమర్పించాలని టీవీ పార్టనర్స్ ను కోరారు. ఐదు నుంచి పది నిమిషాల కార్యక్రమాలు ఎక్స్ పెన్సివ్ గా ఉంటాయి. ఫేస్ బుక్ తో పార్ట్నర్స్ ఉన్న మీడియా కంపెనీ యాజమాన్యంలో ఉంటాయి. ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 45శాతం సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ కు వెళ్తుందని బ్లూమ్బెర్గ్ రిపోర్ట్ లో తెలిపింది.

అయితే ఫేస్ బుక్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు రాలేవు. కానీ ఫేస్ బుక్ టీవీ ప్రోగ్రామ్స్ వస్తున్నట్లు రిపోర్ట్ లో వెల్లడించింది. భవిష్యత్తులో ఫేస్ బుక్ టీవీ కంటెంట్ 20 నుంచి 30నిమిషాలు మాత్రమే ఉంటుంది. మిగతా కంటెంట్ ATTN, BuzzFeed, వోక్స్ మీడియా, గ్రూప్ నైన్ మీడియా వంటి భాగస్వామ్య మీడియా సంస్థలకు చెందుతుంది.

అయితే ఫేస్ బుక్ టీవీ షోలు జూన్ లో విడుదల కావచ్చని కంపెనీ భావిస్తోంది. కానీ ఆగస్టు వరకు ఆగస్టు వరకు ఆలస్యమయ్యాయి. అంతేకాకుండా మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని నివేదికలో వెల్లడించింది.

ఫేస్ బుక్ టీవీ ఎంట్రీతో ...యూట్యూబ్, HBO, నెట్ఫిక్ల్స్ రేటింగ్ పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఫేస్ బుక్ ప్రకటనల కంటే న్యూస్ ఫీడ్ కే అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు ఫేస్ బుక్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ ప్రొగ్రామ్స్ ను నడిపేందుకు అవకాశం ఉంటుంది.

Read more about:
English summary
Facebook TV shows are likely to debut sometime in mid-August, claims a new report. Read more…
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot