ఇక స్థానికంగానే ఫేస్‌బుక్ పన్ను చెల్లింపు!

Posted By: BOMMU SIVANJANEYULU

పన్ను చెల్లింపు చ్టటాలను ఆయా దేశాల ప్రభుత్వాల మరింత కఠినతరం చేస్తోన్న నేపథ్యంలో కార్పోరేట్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా కంపెనీల్లో ఒకటైన ఫేస్‌బుక్, తమకు కార్యాలయాలు ఉన్న అన్ని దేశాల్లో లోకల్ సెల్లింగ్ స్ట్రక్షర్‌ను అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో లాభాలు అర్జింజే దేశాల్లో పన్నులు చెల్లించాలని ఫేస్‌బుక్ భావిస్తోంది.

ఇక స్థానికంగానే ఫేస్‌బుక్ పన్ను చెల్లింపు!

ప్రస్తుతానికి, ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు లభిస్తోన్న అడ్వర్టైజింగ్ రివెన్యూకు సంబంధించిన డేటా మొత్తం డబ్లిన్‌లోని కంపనీ ప్రధాన హెడ్ క్వార్టర్స్‌లో రికార్ట్ అవుతోంది.

త్వరలో అందుబాటలోకి తీసుకురానున్న లోకల్ సెల్లింగ్ స్ట్రక్షర్‌ ద్వారా ఆయా దేశాల నుంచి లభించే అడ్వర్టైజింగ్ రివెన్యూకు సంబంధించిన డేటా ఆయా దేశాల్లోని ఆఫీసుల్లోనే రికార్డ్ అవుతుంది. తద్వారా ఆయా దేశాలకే విడివిడిగా పన్నులు చెల్లించే వీలుంటుంది.

లోకల్ సెల్లింగ్ స్ట్రక్షర్ మరింత పారదర్శకతను కల్పిస్తుందని తద్వారా ప్రభుత్వాలతో పాటు పాలసీ‌మేకర్స్‌కు తమ అడ్వర్టైజింగ్ రివెన్యూ పట్ల మరింత క్లియర్ వ్యూ లభిస్తుందని ఫేస్‌బుక్ చీఫ్ ఫైెనాన్షియల్ ఆఫీసర్ డేవ్ వెహ్నర్ తెలిపారు.

2017 బెస్ట్ యాప్ బుక్ మై షో!

Politico.eu రిపోర్ట్ చేసిన వివరాల ప్రకారం యూఎస్ వెలుపల ఉన్న 30 న్యాయపరిధిల్లో ఫేస్‌బుక్
తన లోకల్ ఆపరేషన్స్ సంబంధించిన పన్నులు చెల్లించిటం ప్రారంభించబోతోంది. వీటిలో ఫ్రాన్స్, జర్మనీలతో పటు మరో 8 యూరోపియన్ దేశాలు ఉన్నాయి. 2019 నాటికి తన లోకల్ సెల్లింగ్ స్ట్రక్షర్‌ను అన్ని ఆఫీసుల్లో అందుబాటులోకి తీసుకువస్తామని ఫేస్‌బుక్ చెబుతోంది.

English summary
Amid high government pressure, Facebook has announced it plans to move to a local selling structure in countries where it has an office.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot