Home
Apps

Tik Tokకు పోటీగా ఫేస్‌బుక్ కొత్త యాప్!

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, Tik Tokకు పోటీగా ఓ సరికొత్త యాప్‌ను మార్కెట్లోకి తీసుకురాబోంది. Lasso (లస్సో) పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది.

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్, Tik Tokకు పోటీగా ఓ సరికొత్త యాప్‌ను మార్కెట్లోకి తీసుకురాబోంది. Lasso (లస్సో) పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఫేస్‌బుక్‌కు చెందిన ఓ స్పెషల్ టీమ్ ఈ యాప్ పై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టిక్ టాక్ తరహాలోనే లింప్ సింక్ లైవ్ ఫీచర్‌లను ఈ యాప్ ఆఫర్ చేయగలుగుతుందట.

డైలాగులకు అనుగుణంగా లిప్ సింక్..

డైలాగులకు అనుగుణంగా లిప్ సింక్..

టెక్‌క్రంచ్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఫేస్‌బుక్ డిజైన్ చేస్తోన్న లస్సో యాప్ ద్వారా యూజర్లు పాటలు అలానే డైలాగులకు అనుగుణంగా లిప్ సింక్ చేస్తూ వాటిని షేర్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ ప్రిన్సిపల్ లీడ్ ప్రొడక్ట్ మేనేజర్ అయిన బ్రాడీ వోస్, లస్సో యాప్‌ను అభివృద్థి చేస్తోన్న టీమ్‌కు నేతృత్వం వహిస్తున్నారట.

ప్రత్యేకించి కుర్రకారు కోసం..

ప్రత్యేకించి కుర్రకారు కోసం..

ఇంటర్నెట్ ప్రపంచంలోకి పెను సంచలనంలా దూసుకొచ్చిన షార్ట్-వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Tik Tokను ఆరు నెలల క్రితమే Musical.ly కొనుగోలు చేసింది. ప్రత్యేకించి కుర్రకారు కోసం డిజైన్ చేయబడిన ఈ లిప్ సింకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఫన్నీ వీడియోస్‌ను క్రియేట్ చేయటంతో పాటు వాటిని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు.

కొత్తగా మ్యూజిక్ ఫీచర్..

కొత్తగా మ్యూజిక్ ఫీచర్..

ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తమ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా మరో ఫీచర్‌తో ముందుకొచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ మ్యూజిక్ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫేస్‌బుక్ స్టోరీల్లోని ఫోటోలు, వీడియోలకు తమకు నచ్చిన పాటలను జోడించే వీలుంది. ఈ ఫీచర్ ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్‌కి సైతం వర్తిస్తుందని ఫేస్‌బుక్ ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే యూజర్స్ తమ ప్రొఫైల్స్‌కి కూడా పాటలు జోడించే ఫీచర్ అందుబాటులోకి రానుందని ఫేస్‌బుక్ ఈ ప్రకటనలో పేర్కొంది.

యూసేజ్ ఇన్‌సైట్స్ పేరుతో..

యూసేజ్ ఇన్‌సైట్స్ పేరుతో..

ఫేస్‌బుక్‌కు సంబంధించి కొద్ది నెలల క్రితం చోటుచేసుకున్న టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్‌లను మనం గమనించినట్లయితే ఫేస్‌బుక్ నేతృత్వంలోని ఇన్‌స్టాగ్రామ్, యూసేజ్ ఇన్‌సైట్స్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో రోజు ఎంత సేపు గడుపుతున్నామనేదాని గురించి తెలసుకునే వీలుంటుంది. తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే గూగుల్, యాపిల్ సంస్థలకు ధీటుగా కొత్త టెక్నాలజీలను ఫేస్‌బుక్‌కు ఇంప్లిమెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Facebook Working on Lasso App to Take on Tik Tok, Musical.ly: Report.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X