భారీగా ఛార్జీల బాదుడు షురూ చేసిన వాట్సప్

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ దిగ్గజం వాట్సప్ ఛార్జీలు బాదుడు షురూ చేసినట్లుగా తెలుస్తోంది.

|

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ దిగ్గజం వాట్సప్ ఛార్జీలు బాదుడు షురూ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటిదాకా ఎలాంటి ఛార్జ్‌లు వసూలు చేయకుండా ఉచితంగా తన సర్వీసులను అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చేతిలో మొబైల్ అందులో ఇంటర్నెట్ ఉంటే వాట్సప్ ను వాడుకోవచ్చనే విధానానికి ఇకపై స్వస్తి పలుకుతూ వాట్సప్‌ కూడా ఛార్జీల బాదుడు షురూ చేయాలని నిర్ణయించింది. అయితే ప్రస్తుతం అది యూజర్లందరకూ కాకుండా కేవలం బిజినెస్‌ యూజర్లకు మాత్రమేనని చెబుతోంది.

యజమాని ప్రాణాన్ని కాపాడిన స్మార్ట్ డాగ్, వైరల్ వీడియో ఇదే !యజమాని ప్రాణాన్ని కాపాడిన స్మార్ట్ డాగ్, వైరల్ వీడియో ఇదే !

 బిజినెస్ వాడే వారికి..

బిజినెస్ వాడే వారికి..

పర్సనల్ యూజర్లు కాకుండా బిజినెస్ వాడే వారికి ఈ ఛార్జీలు ప్రస్తుతానికి విధిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముందు ముందు యూజర్లకు కూడా ఛార్జీలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై వాట్సప్ ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

మెసేజ్‌లు పంపే వారి నుంచి ..

మెసేజ్‌లు పంపే వారి నుంచి ..

కాగా మార్కెటింగ్‌, కస్టమర్‌ సర్వీసు మెసేజ్‌లు పంపే వారి నుంచి ఇక ఛార్జీలు వసూలు చేయాలని ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సప్‌ నిర్ణయించిందని తెలిసింది. 

రెవెన్యూ వృద్ధి లేకపోవడంతో..

రెవెన్యూ వృద్ధి లేకపోవడంతో..

యూసేజ్‌ తగ్గిపోవడం, రెవెన్యూ వృద్ధి లేకపోవడంతో, ఈ ఛార్జీలను విధిస్తున్నట్టు వాట్సప్‌ ప్రకటించింది.

మెసేజ్‌ డెలివరీ

మెసేజ్‌ డెలివరీ

పంపించిన మెసేజ్‌ డెలివరీ అయినట్టు తెలిసిన తర్వాత వెంటనే ఒక్కో మెసేజ్‌కు 0.5 సెంట్ల నుంచి 9 సెంట్ల వరకు ఛార్జీలు వసూలు చేస్తామని వాట్సాప్‌ తెలిపింది. దీంతో వాట్సప్‌ బిజినెస్‌ యూజర్లలో ఆందోళన నెలకొంది.

మన దేశంలో ఈ ఛార్జీలు..

మన దేశంలో ఈ ఛార్జీలు..

దీని ప్రకారం మన దేశంలో ఈ ఛార్జీలు 34.16 పైసల నుంచి రూ.6.15 వరకు ఉంటాయి. ఆసక్తికర అంశం ఏంటంటే వాట్సప్‌ ప్రస్తుతం విధించబోతున్న ఈ ఛార్జీలు ఎస్‌ఎంఎస్‌ రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి.

1 .5 బిలియన్‌ యూజర్లు

1 .5 బిలియన్‌ యూజర్లు

వాట్సప్‌కు మొత్తం 1 .5 బిలియన్‌ యూజర్లున్నారు. బిజినెస్‌లు చేసే వారు నోటిఫికేషన్లను పంపడానికి వాట్సప్‌ బిజినెస్‌ ఏపీఐను వాడుతున్నారు.

జనవరిలోనే ..

జనవరిలోనే ..

వాట్సప్‌ ఈ జనవరిలోనే చిన్న వ్యాపార అకౌంట్ల కోసం ఈ వాట్సప్‌ బిజినెస్‌ అప్లికేషన్‌ను తీసుకొచ్చింది. దీనిలో 30 లక్షల మందికి పైగా యాక్టివ్‌ యూజర్లున్నారు.

వాట్సప్‌ బిజినెస్‌ అప్లికేషన్‌

వాట్సప్‌ బిజినెస్‌ అప్లికేషన్‌

ఆ సమయంలోనే వాట్సప్‌ బిజినెస్‌ అప్లికేషన్‌ నుంచి ఛార్జీలు వసూలు చేసే ఉద్దేశ్యం ఉందని చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మ్యాట్‌ ఐడెమా తెలిపారు.

Best Mobiles in India

English summary
Facebook’s Whatsapp is about to start charging its business users More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X