మీ ఫోన్ లో బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త !
మీ ఫోన్‌లో బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా అయితే అది ఒరిజనలేనా ప్లేస్టోర్, యాప్‌స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నదేనా లేక 'ఏపీకే' ఫైల్ ఇన్‌స్టాల్ చేశారా అనేది ఓ సారి చెక్ చేసుకోండి .
మీ ఫోన్‌లో బ్యాంకింగ్ యాప్స్ వాడుతున్నారా అయితే అది ఒరిజనలేనా ప్లేస్టోర్, యాప్‌స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నదేనా లేక 'ఏపీకే' ఫైల్ ఇన్‌స్టాల్ చేశారా అనేది ఓ సారి చెక్ చేసుకోండి . ఎందుకంటే ఇప్పుడు ఫేక్ బ్యాంక్ యాప్స్ కలకలం రేపుతున్నాయి. ఫేక్ బ్యాంక్ యాప్స్ ఇప్పటికే వేలాది మంది డేటా కొట్టేసినట్టు తెలుస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఇండియన్ ఓవర్‌సీస్, బీఓబీ, యెస్ బ్యాంక్, సిటీ బ్యాంక్‌కు సంబంధించిన ఫేక్ యాప్స్‌తో సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్టు ఐటీ సెక్యూరిటీ విభాగానికి చెందిన సోఫోస్ ల్యాబ్స్ సంస్థ ఒక నివేదికలో వెల్లడించింది.

బ్యాంకులకు సంబంధించి గూగుల్ ప్లే స్టోర్ లో....
బ్యాంకులకు సంబంధించి గూగుల్ ప్లే స్టోర్ లో లభించే వాటిలో ఏది అసలుదో, ఏది ఫేక్ గుర్తించడం వినియోగదారులు కష్టాంగా మారిందని సెక్యూరిటీ సంస్థ తెలిపింది. ఈ యాప్‌లలో ఉండే మోసపూరిత మాల్‌వేర్ ద్వారా సైబర్ నేరగాళ్లు కస్టమర్ల ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాలను దొంగిలిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయమై సంబంధిత బ్యాంకులను సంప్రదించగా కొన్ని బ్యాంకులు ఎలాంటి ఫేక్ యాప్‌లు చెలామణిలో లేవని తెలుపగా మరికొన్ని బ్యాంకులు దీనిపై విచారణకు ఆదేశించించినట్లు తెలిపాయని సోఫోస్ ల్యాబ్స్ తన నివేదికలో వెల్లడించింది.

ఏడు బ్యాంకులకు సంబంధించి ఫేక్ యాప్స్....
ముఖ్యంగా ఏడు బ్యాంకులకు సంబంధించి ఫేక్ యాప్స్ చెలామణిలో ఉన్నాయి. వీటిలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్, సిటీ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యస్ బ్యాంక్ ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ విషయమై బ్యాంక్ సైబర్ నిరోధక విభాగానికి ఫిర్యాదు చేసినట్లు యస్ బ్యాంక్ తెలిపింది. దేశ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ఈ విషయమై ఇంతవరకు స్పందించలేదు. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకుల నుంచి కూడా సత్వర ప్రకటన వెల్లడి కాలేదు.

ఉచిత రుణాల పేరుతో ఇంటర్నెట్ యాప్స్....
నివేదిక ప్రకారం రివార్డ్స్, కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్, ఫ్రీ మొబల్ డేటా, ఉచిత రుణాల పేరుతో ఇంటర్నెట్ యాప్స్ ఈ వాలెట్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఈ కారణంగా అసలు యాప్ మాదిరిగా కనిపించే ఫేక్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారు. దీనివల్ల డేటా బహిర్గతమవుతోంది.

ఫేక్ యాప్స్ తయారు చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు....
కస్టమర్లను బుట్టలో వేసుకునేందుకే ఇలా బ్యాంకుల పేర్లతో ఫేక్ యాప్స్ తయారు చేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. గూగుల్ ప్లే స్టోర్‌లో ఇలాంటి ఫేక్ యాప్స్ చాలా ఉంటాయి అందువల్ల ఏదైనా బ్యాంక్ యాప్ ఇన్‌స్టాల్ చేసే ముందు కొంచెం జాగ్రత్త వహించండి.


Click it and Unblock the Notifications








