ఈ 5 టిప్స్ పాటిస్తే నకిలీ మొబైల్ యాప్స్ కి ఈజీగా చెక్ పెట్టొచ్చు

మన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు గూగుల్ ప్లో స్టోర్‌లోకి వెళ్లి రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటాం.

|

మన చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు గూగుల్ ప్లో స్టోర్‌లోకి వెళ్లి రకరకాల యాప్స్ డౌన్‌లోడ్ చేస్తుంటాం. Google Play Store నుండి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదని చాలామంది అపోహపడుతుంటారు. వాస్తవానికి ప్లే స్టోర్ లో కూడా ప్రమాదకరమైన అనేక ఫేక్ యాప్స్ చలామణి అవుతున్నాయి.బాగా పేరున్నయాప్స్ క్లోన్‌గా ఇవి కనిపిస్తుంటాయి.ఈ నేపథ్యంలో చాలామంది ఒరిజినల్ యాప్స్ కి బదులుగా ఫేక్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రమాదం బారిన పడుతుంటారు. ఒకసారి నకిలీ యాప్స్ మన ఫోన్ లోకి వచ్చిన తరువాత మనకు తెలియకుండానే అదనంగా కమాండ్ కంట్రోల్ సర్వర్ నుండి .apkలను డౌన్లోడ్ చేయడం, ఇతర ప్రమాదకరమైన స్క్రిప్టులను రన్ చేస్తుంటాయి.కాబట్టి మీరు ఈ 5 టిప్స్ పాటించి మీ ఫోన్లను రక్షించుకోండి.

చైల్ట్ ఫోర్నోగ్రపీకి అడ్డాగా మారిన వాట్సప్, వణుకుతున్న ఇండియాచైల్ట్ ఫోర్నోగ్రపీకి అడ్డాగా మారిన వాట్సప్, వణుకుతున్న ఇండియా

టిప్ 1

టిప్ 1

నకిలీ యాప్స్ డిస్క్రిప్షన్ రాసే విధానంలో చాలా లోపాలు ఉంటాయి. స్పెల్లింగ్ లోపాలు, ఫీచర్ల గురించి సరైన వివరణ లేకపోవడం, గ్రామర్ పరంగా కూడా లోపాలను వెతికి పట్టుకోవచ్చు. దాన్నిబట్టే అది ఫేక్ యాప్స్ అన్న విషయం సులభంగా గ్రహించవచ్చు.

టిప్ 2

టిప్ 2

సహజంగా గూగుల్ ప్లేస్టోర్ లో అప్లోడ్ చేయబడే ప్రతి యాప్ ను ను ఎవరు డెవలప్ చేశారు అన్న విషయం డెవలపర్ పేరు స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది. ఆ పేరుని గూగుల్‌లో వెదికి ఆ డెవలపర్‌కి చెందిన అధికారిక వెబ్సైట్ పరిశీలించడం ద్వారా పేరున్న డెవలపర్ లేదా అన్న విషయం అర్థం చేసుకోవచ్చు.

టిప్ 3

టిప్ 3

యాప్‌కు ఉన్న రేటింగ్‌పై కూడా ఓ కన్నేయండి. ఎందుకంటే నకిలీ యాప్స్‌కు రేటింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఒరిజినల్ యాప్స్‌కు రేటింగ్ ఎక్కువ ఉంటుంది.

టిప్ 4

టిప్ 4

థర్డ్ పార్టీ యాప్ స్టోర్ నుంచి యాప్ ను డౌన్లోడ్ చేయడం మానేయండి.

టిప్ 5

టిప్ 5

సెక్యూరిటీ ఇంకా మాల్వేర్ దాడుల నుంచి రక్షించుకునేందుకు నమ్మదగిన యాంటీ వైరస్ ను ఉపయాగించండి.

Best Mobiles in India

English summary
Five easy tips to identify and avoid downloading fake mobile apps.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X