Home
Apps

Gadfly యాప్‌లో నేతల పూర్తి వివరాలు,సమస్యలపై వారిని ప్రశ్నించండి ఇక !

NCR-based Wabi Tech ప్రజల కోసం సరికొత్త యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. Gadfly పేరుతో వచ్చిన ఈ యాప్‌లో నేతలకు సంబంధించిన సమగ్రసమాచారం ఉంటుంది.

By Hazarath Aiah

NCR-based Wabi Tech ప్రజల కోసం సరికొత్త యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. Gadfly పేరుతో వచ్చిన ఈ యాప్‌లో నేతలకు సంబంధించిన సమగ్రసమాచారం ఉంటుంది. వారి ఫోన్ నంబర్లు, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇంకా ఇతర సోషల్ మీడియా వివరాలు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి వారితో మీరు నేరుగా సంభాషించుకునే అవకాశం ఉంటుంది. వారి ప్రాంతంలో ఏమైనా సమస్యలుంటే వారు నేరుగా ఆ ప్రాంత ఎంపీ, ఎమ్మెల్యే లేదా కౌన్సిలర్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఈ యాప్ ద్వారా కలుగుతుంది. ఈ సంధర్భంగా Wabi Tech ప్రెసిడెంట్ నికిల్ బప్నా మాట్లాడుతూ టెక్నాలజీ రంగ ప్రజలకు చాలా దగ్గరగా చేరువయిందిని వారి జీవితాలను మార్చే ప్రధాన సాధనంగా మారిందని అన్నారు. ప్రజాస్వామ్యం మరింతగా ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నామని తెలిపారు.

 సమస్యలను మాత్రమే ..

సమస్యలను మాత్రమే ..

ఈ యాప్ ద్వారా మీరు కేవలం సమస్యలను మాత్రమే చెప్పుకోవచ్చు. అలాగే సిల్లీ కబుర్లు, ఫన్నీ జోకులు, లేదా ఇతర పనికిరాని విషయాలను చర్చించే అవకాశం ఉండదు. నేతలతో మీరు కమ్యూనికేట్ అయ్యే విధానాన్ని బట్టి అవతల నుంచి మీకు రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది.

మీ ఆలోచనలను ప్రభుత్వంతో షేర్..

మీ ఆలోచనలను ప్రభుత్వంతో షేర్..

ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ యాప్ ద్వారా మీరు మీ ఆలోచనలను ప్రభుత్వంతో షేర్ చేసుకోవచ్చు. ప్రజలకు ఉపయోగపడే ఎటువంటి ఆలోచనలు అయినా మీరు ఇందులో పోస్ట్ చేయవచ్చు. ఇందులో ఫేస్ బుక్ ట్విట్టర్ లాంటి వాటితో నేతలు అనుసంధానమై ఉన్నారు కాబట్టి మీరు వారితో పరోక్షంగా కలిసే అవకాశం కూడా ఉంది. మీ అభిప్రాయాలను వారితో పంచుకునే అవకాశం కూడా ఉంది.

రెండు భాషల్లో మాత్రమే

రెండు భాషల్లో మాత్రమే

అయితే ఈ యాప్ ఇప్పుడు కేవలం రెండు భాషల్లో మాత్రమే లభ్యమవుతోంది హిందీ ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతానికి ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

లింక్ ద్వారా డౌన్ లోడ్..

లింక్ ద్వారా డౌన్ లోడ్..

ఇంకా కొంతమంది నేతల వివరాలు ఈ యాప్ లోకి రావాల్సి ఉంది. అతి త్వరలో పూర్తి స్థాయిలో ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ ప్రతినిధులు చెబుుతున్నారు. ఈ యాప్ కావాల్సిన వారు గూగుల్ ప్లే స్టోర్ నుండి https://play.google.com/store/apps/details?id=com.mobile.wabi_tech.gadfly&hl=en ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోగలరు.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Gadfly, the app that lets you shout out to your elected representatives More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X