వొడాఫోన్ బంపర్ ఆఫర్!

రిలయన్స్ జియోకు పోటీగా వొడాఫోన్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. రిలయన్స్ MyJio యాప్ తరహాలో వొడాఫోన్ తన Vodafone Play యాప్‌ను మూడు నెలల పాటు ఉచితంగా సబ్‌స్ర్కైబ్ చేసుకునే అవకాశాన్ని తన యూజర్లకు కల్పిస్తోంది.

Read More : 3జీబి ర్యామ్‌తో నోకియా ఫోన్..? రూ.10,000 రేంజ్‌లో..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫిబ్రవరి 2016లో లాంచ్ చేసారు

వొడాఫోన్ ప్లే యాప్‌ను ఫిబ్రవరి 2016లో లాంచ్ చేయటం జరిగింది. వొడాఫోన్ 3జీ అలానే 4జీ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. ఏప్రిల్ 15 నుంచి ఈ యాప్ ను 4జీ యూజర్లకు 3 నెలలు పాటు 3జీ యూజర్లకు 1 నెల పాటు ఉచితంగా అందిచారు. ఆగష్టు 31తో ఆ గడువు ముగియటంతో తాజా సవరణలో భాగంగా డిసెంబర్ 31, 2016కు ఈ సబ్ స్ర్కిప్షన్‌ను పొడిగించటం జరిగింది.

పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌

Vodafone Play యాప్ పూర్తిస్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా పూర్తి నిడివి సినిమాలతో పాటు లైవ్ టెలివిజన్ షోస్ అలానే వివిధ genresకు చెందిన మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

వొడాఫోన్ చెబుతున్న వివరాల ప్రకారం..

ఈ యాప్‌లో 180 లైవ్ టీవీ ఛానళ్లతో పాటు 14000 పై చిలుకు సినిమాలు ఇంకా 12 లక్షల ఆడియో, వీడియో సాంగ్స్ అందుబాటులో ఉంటాయి.

ఈ యాప్ మీ ఫోన్‌లో సపోర్ట్ చేయాలంటే..?

ఆండ్రాయిడ్ 4.1, iOS 7.0తో పాటు ఆపై వర్షన్ డివైస్‌లను Vodafone Play యాప్ సపోర్ట్ చేస్తుంది.

ఈ సబ్‌స్ర్కిప్షన్‌ పొందాలంటే..?

ఈ 90 రోజుల ఉచిత సబ్‌స్ర్కిప్షన్‌ను పొందాలనుకునే ఆండ్రాయిడ్ అలానే ఐఫోన్ యూజర్లు తమ తమ గూగుల్ ప్లే/ఐఓఎస్ యాప్ స్టోర్‌ల నుంచి Vodafone Play యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా కుదరని పక్షంలో PLAY అని టైప్ చేసి 199 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయటం ద్వారా అప్లికేషన్‌కు సంబంధించిన లింక్ అందుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Vodafone Play: How to Get Free Subscription for 90 Days. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot