Gmail కొత్త ఫీచర్.. మీకు వచ్చిన భాషలో మెయిల్‌ను చదవచ్చు..!
జీమెయిల్ యాప్ నుంచి మనకు వచ్చిన ఈమెయిల్‌లను యాప్‌లోనే నేరుగా ట్రాన్సిలేషన్ చేసుకోవచ్చు. గతంలో ఈ ఫీచర్ జీమెయిల్ వెబ్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, iOS విడుదల చేస్తున్నారు. ఈ ఫీచర్ గురించి బ్లాగ్‌లో గూగుల్ తెలిపింది.
గత చాలా సంవత్సరాలుగా యూజర్లు.. జీమెయిల్ వెబ్ వెర్షన్‌లో సుమారు 100 భాషల్లో ట్రాన్సిలేషన్ చేసుకోగలుగుతున్నారు. ప్రస్తుతం జీమెయిల్ యాప్ ద్వారా కూడా సొంత భాషల్లో యూజర్లు తమ మెయిల్‌ను అనువాదం చేసుకోవచ్చని గూగుల్ తన బ్లాగ్‌లో ఓ పోస్టు చేసింది.

ఆ ఫీచర్ వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుందని గూగుల్ తెలిపింది. యూజర్లకు అర్థం కాని భాషలో ఏమైనా ఈమెయిల్ వస్తే సొంత భాషలో అనువాదం చేసుకొని, అర్థం చేసుకోవచ్చని పేర్కొంది.
ఈ ఫీచర్ కారణంగా జీమెయిల్ యాప్‌లో వచ్చిన మెయిల్ భాషను ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది.
అనంతరం ఓ బ్యానర్ పైన కనిపిస్తుంది. దాని ద్వారా యూజర్లు తమకు నచ్చిన భాషలో మెయిల్‌ను అనువాదం చేసుకోవచ్చు. ఉదాహరణకు స్పేనిష్ భాషలో ఏదైనా మెయిల్ వస్తే.. యూజర్ కేవలం ఇంగ్లీష్ మాత్రమే అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంటే.. అక్కడ కనిపించిన టాప్ టూ ఇంగ్లీష్ పైన క్లిక్ చేసి, మెయిల్‌ను చదువుకోవచ్చు.
ఈ ఫీచర్‌ను ఎలా వినియోగించుకోవాలి : ముందుగా జీమెయిల్ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మీరు ఏ మెయిల్‌ను అనువాదం చేయాలని భావిస్తున్నారో ఎంపిక చేసుకోవాలి. కుడివైపును కనిపించిన మూడు చుక్కలపైన టాప్ చేయండి. సెలక్ట్ ట్రాన్సిలేట్‌ను ఎంపిక చేసుకోండి. అనంతరం భాషను ఎంచుకోండి. దీంతో మీకు నచ్చిన భాషలోకి మారుతుంది.
వినియోగదారులకు అవసరం లేని సమయంలో మెయిల్ ట్రాన్సిలేట్ బ్యానర్‌ను ఆఫ్ చేసుకోవచ్చు. ఈ జీమెయిల్ యాప్‌లోని ఫీచర్ మీకు కావాల్సిన భాషను ఎంపిక చేయలేని సందర్భంలో.. జీమెయిల్ యాప్‌లో కనిపించిన మూడు చుక్కల మెనును ఎంపిక చేసి మాన్యువల్‌గా అనువాదం చేసుకోవాలి.
ప్రస్తుతం ఈ ట్రాన్సిలేషన్ ఫీచర్ బీటా స్థాయిలో ఉంది. ఫలితంగా అనువాదంలో చిన్న తప్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా న్యాయపరమైన లేదా టెక్నికల్ కంటెంట్‌ను సరిచూసుకోవాల్సి రావచ్చు. అయితే ఈ ఫీచర్‌తో ఒక సమయంలో ఒకే మెయిల్‌ను అనువాదం చేసుకోవాలి. ప్రస్తుతానికి అన్ని మెయిల్‌లను ఒకేసారి అనువాదం చేసుకొనే అవకాశం లేదు.
ప్రస్తుతం ఈ ఫీచర్ కొంత మందికే అందుబాటులో వచ్చింది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మీకు ఈ ఫీచర్ కావాలంటే జీమెయిల్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోండి. అనంతరం కూడా ఈ ఫీచర్ అందుబాటులో లేకుంటే కొన్ని రోజులు వేచిచూడాల్సి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








