Just In
- 10 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 15 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 17 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
జీమెయిల్‌లోకి మూడు కొత్త ఫీచర్లు
సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన జీమెయిల్ సర్వీసెస్‌ను ఉద్దేశించి మూడు సరికొత్త ఫీచర్లను రోల్ అవుట్ చేయబోతోంది. వీటిలో మొదటి ఫీచర్ ద్వారా ఏదైనా కొత్త మెయిల్‌ను కంపోజ్ చేస్తున్నపుడు తప్పులు దొర్లినట్లయితే వాటిని సులువుగా ఎడిట్ చేసుకునే వీలుంటుందట. ఇక రెండవ ఫీచర్ షార్ట్‌కట్ బటన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. మూడవ ఫీచర్ విషయానికి వచ్చేసరికి ఈ ఫీచర్ ద్వారా మెయిల్‌లోని మెసేజ్‌లను కావల్సిన ఫార్మాట్‌లో డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుందట.

కంపోజ్ విండోలో undo/redoకు ఇప్పుడు షార్ట్ కట్ వచ్చేసింది..
మెయిల్‌కు సంబంధించి డ్రాఫ్ట్‌ను తయారు చేస్తున్నప్పుడు అనుకోకుండా అందులోని కంటెంట్ డిలీట్ అయినట్లయితే undo షార్ట్‌కట్‌ను ఉపయోగించుకుని దానిని తిరిగిపొందే వీలుంటుంది. ఈ షార్ట్‌కట్ కంపోజ్ వ్యూలోనే అందుబాటులో ఉంటుంది. అదే విధంగా redo షార్ట్‌కట్ కూడా అందుబాటులో ఉంటుంది.

కొట్టివేత (Strikethrough) కోసం ప్రత్యేకమైన షార్ట్‌కట్
మెయిల్‌ను కంపోజ్ చేస్తునపుడు బోల్డ్, ఇలాటిక్స్, అండర్‌లైన్ వంటి షార్ట్ కట్స్‌ను తరచూ ఉపయోగిస్తుంటాం. ఇదే విధంగా ఒక్కోసారి టెక్స్ట్‌ను Strikethrough చేయవల్సి ఉంటుంది. గతంలో ఇలా చేసేందుకు షార్ట్‌కట్ అంటూ ఏమి ఉండేది కాదు. తాజా అప్ డేట్ లో భాగంగా Strikethrough షార్ట్‌కట్‌ను కూడా ఫార్మాటింగ్ సెక్షన్‌లో గూగుల్ యాడ్ చేసింది.

ఇక నుంచి .EML ఫైల్స్‌ను rfc822 ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
.EML అనేది ఈమెయిల్ ప్రోగ్రామ్స్ కోసం రూపొందించబడిన ఓ స్టాండర్డ్ ఫైల్ ఫార్మాట్. rfc822 ఫార్మాట్‌లో వీటిని డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుంది. ఈ ఫైల్స్‌ను ఎక్కువగా ఈమెయిల్ క్లయింట్స్, సర్వర్స్ ఇంకా అప్లికేషన్స్‌తో వినియోగిస్తుంటారు. మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ ఎక్స్‌ప్రెస్‌తో పాటుగా మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ ఎంటరేజ్, మొజిల్లా థండర్‌బోర్డ్, యాపిల్ మెయిల్, ఇంక్రెడి మెయిల్ వంటి ఈమెయిల్ క్లయింట్స్ లోని ఫైల్స్ .EMLలోనే ఓపెన్ అవుతుంటాయి. గూగుల్ తన లేటెస్ట్ అప్ డేట్ లో భాగంగా జీమెయిల్ యూజర్లకు .EML ఫైల్స్‌ను rfc822 ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఆఫ్‌లైన్‌లో మెయిల్స్‌ను చదవటమే కాకుండా..
జీమెయిల్‌లో ఇటీవల యాడ్ అయిన ఆఫ్‌లైన్ సపోర్ట్ ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టువిటీ అందుబాటులో లేనప్పటికి జీమెయిల్‌లో వర్క్ చేసుకునే వీలుంటుంది. ఆఫ్‌లైన్‌లో మెయిల్స్‌ను చదవటమే కాకుండా వాటిని ఆర్చివ్ చేయటం, డిలీట్ చేయటం, కొత్త మెయిల్‌ను క్రియేట్ చేయటం, సెర్చ్ చేయటం వంటి పనులన చక్కబెట్టుకునే వీలుటుంది. ఇంటర్నెట్ కనెక్టువిటీ అందుబాటులోకి వచ్చిన తరువాత యూజర్ చేసిన వర్క్ మొత్తం ఆన్‌లైన్‌లో అన్ని డివైస్‌ల మధ్య సింక్ కాబడుతుంది.జీమెయిల్ ఆఫ్‌లైన్ సపోర్ట్ ఫీచర్‌ను పొందాలనుకునే యూజర్లు ముందుగా క్రోమ్ బ్రౌజర్ వర్షన్ 61ను తమ పీసీల్లో డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. బ్రౌజర్ అప్‌డేట్ అయిన తరువాత మీ జిమెయిల్ అకౌంట్‌లోకి వెళ్లి టాప్ రైట్ సైడ్‌లో కనిపించే సెట్టింగ్స్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయ్యే డ్రాప్‌డౌన్ మెనూలో ‘సెట్టింగ్స్' టాబ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయ్యే మరో మెనూ బార్‌లో ‘ఆఫ్‌లైన్' టాబ్‌ను సెలక్ట్ చేసుకుని ‘ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్' ఆప్షన్‌ను చెక్ చేసుకుని సెట్టింగ్స్‌ను మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకుంటే సరిపోతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470