50 కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రానున్న రోజుల్లో ఏం జరగనుందో..?
మెటాకు చెందిన (Meta) ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ భారత్‌లో ఏకంగా 50 కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. భారీ సంఖ్యలో ఉన్న తమ యూజర్ల కోసం వాట్సాప్ అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వినియోగదారుల సౌకర్యం, భద్రత కోసం వివిధ ఫీచర్‌లను లాంచ్ చేస్తోంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ కు గుడ్‌న్యూస్ చెప్పింది.
భారత్‌లో 50 కోట్ల వాట్సాప్ యూజర్లు :
ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి కీలక ప్రకటన వెలువడింది. వాట్సాప్ గతంలో యూపీఐ పేమెంట్స్ వ్యవస్థను (Whatsapp UPI Payments) లాంచ్ చేసింది. అయితే దీనిపై కేంద్రం కొన్ని ఆంక్షలు విధించింది. భారత్‌లో 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉండగా.. 2020 సంవత్సరంలో కేవలం 4 కోట్ల మందికి మాత్రమే వాట్సాప్ పేమెంట్స్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు అనుమతి ఇచ్చింది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన :
అనంతరం 2022 సంవత్సరంలో 10 కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు UPI పేమెంట్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చింది. తాజాగా యూపీఐ సర్వీసులను పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక ప్రకటన చేసింది.
వాట్సాప్‌పై ఉన్న ఆంక్షలు ఎత్తివేత :
వాట్సాప్ పైన ఉన్న ఆంక్షలను పూర్తి ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. మరియు తన మొత్తం యూజర్లకు ఈ UPI సర్పీసులను పొడిగించుకొనేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే 10 కోట్ల మందికి వాట్సాప్ యూజర్లకు UPI ఫీచర్ అందుబాటులో ఉండగా.. తాజా ప్రకటనతో త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.
85 శాతం ట్రాన్సాక్షన్‌లు ఈ రెండు యాప్‌ల నుంచే :
ప్రస్తుతం భారత్‌లో ప్రతి నెలా 13 మిలియన్ UPI ట్రాన్సాక్షన్‌లు జరుగుతున్నాయి. వీటితో అత్యధికం ఫోన్ పే, గూగుల్ పే యాప్‌ల నుంచే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం లావాదేవీల్లో ఈ రెండు యాప్‌ల నుంచే సుమారు 85 శాతం ట్రాన్సాక్షన్‌లు జరుగుతున్నాయి.
రానున్న రోజుల్లో ఏం జరగనుంది :
అయితే తాజాగా NPCI వాట్సాప్ UPI పేమెంట్లపై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేసిన నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ల వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం టాప్‌లో ఉన్న యాప్‌లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
* తాజాగా కేంద్ర హోం శాఖ 2023-24 సైబర్ మోసాలకు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. దీని ఆధారంగా వాట్సాప్ ద్వారానే అత్యధిక శాతం సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నట్లు తెలిపింది. వాట్సాప్ తర్వాత టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు హోంశాఖ పేర్కొంది.
2023-24 తొలి మూడు నెలల్లో వాట్సాప్ వేదికగా మోసపోయినట్లు 43,787 మంది ఫిర్యాదు చేసినట్లు నివేదికలో వివరించింది. మరియు టెలిగ్రామ్ ప్లాట్‌ఫాం ద్వారా మోసపోయినట్లు 22,680, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫాం ద్వారా మోసపోయినట్లు 19,800 మంది ఫిర్యాదు చేసినట్లు హోంశాఖ తన నివేదికలో వెల్లడించింది.


Click it and Unblock the Notifications








