ఆసక్తి రేపుతోన్న గూగుల్ Allo 2.0

ఈ యాప్ ద్వారా ఒక్క చాటింగ్ మాత్రమే కాదు బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు.

|

విప్లవాత్మక స్మార్ట్ మెసేజింగ్ యాప్ Allo కోసం గూగుల్ మొదటి అప్‌డేట్‌ను లాంచ్ చేసింది. Google Allo 2.0 పేరుతో విడుదలైన ఈ అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా పొందవచ్చు.

ఆసక్తి రేపుతోన్న గూగుల్ Allo 2.0

Read More : వాట్సాప్‌కు షాకిచ్చిన Hike, అందుబాటులోకి వీడియో కాల్స్ ఆఫ్షన్

ఇప్పటికే ఈ యాప్‌ను వినియోగించుకుంటోన్న యూజర్లు ప్లే స్టోర్‌లోకి వెళ్లి యాప్‌ను అప్‌డేట్ చేసుకోవటం ద్వారా కొత్త ఫీచర్లు యాడ్ అవుతాయి. ఈ కొత్త అప్‌డేట్‌లో పొందుపరిచిన పలు ఆసక్తికర ఫీచర్లను ఇప్పుడు చూద్దాం...

 GIF కీబోర్డ్ సపోర్ట్

GIF కీబోర్డ్ సపోర్ట్

గూగుల్ Allo 2.0 వర్షన్ లో భాగంగా GIF ఇమేజ్‌లను చాలా సులువుగా పంపుకోవచ్చు. ఆండ్రాయిడ్ 7.1 అప్‌డేట్‌తో వస్తోన్న గూగుల్ పిక్సల్ స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ Allo అప్‌డేటెడ్ వర్షన్ అందుబాటులో ఉంది.

ఇంటిగ్రేటెడ్ విండ్ ఆండ్రాయిడ్ వేర్

ఇంటిగ్రేటెడ్ విండ్ ఆండ్రాయిడ్ వేర్

మీ వద్ద ఆండ్రాయిడ్ వేరబుల్ డివైస్ ఉన్నట్లయితే ఈ యాప్ సౌజన్యంతో ఇన్‌కమింగ్ మెసేజ్‌లకు వాయిస్ లేదా emojis ద్వారా రిప్లై ఇవ్వొచ్చు.

డైరెక్ట్‌ షేర్

డైరెక్ట్‌ షేర్

అప్‌డేటెడ్ వర్షన్ గూగుల్ Allo యాప్ splash screenతో కనిపిస్తుంది. ఈ సదుపాయం ద్వారా ఆండ్రాయిడ్ షేర్ మెనూ నుంచే నిర్ణీత వ్యక్తి లేదా గ్రూప్‌కు ఇమేజ్ లేదా ఫోటోను డైరెక్ట్‌గా షేర్ చేయవచ్చు.

సరికొత్త థీమ్స్‌..
 

సరికొత్త థీమ్స్‌..

అప్‌డేటెడ్ వర్షన్ గూగుల్ Allo చాట్ యాప్ సరికొత్త థీమ్స్‌ను అందుబాటులోకి తీసుకవచ్చింది. సెట్టింగ్స్‌లోకి వెళ్లటం ద్వారా కావల్సిన థీమ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Split-Screen

Split-Screen

Split-Screen మల్టీ టాస్కింగ్ మోడ్, క్విక్ రిప్లై వంటి ప్రత్యేక ఫీచర్లు అప్‌డేటెడ్ వర్షన్ గూగుల్ Allo చాట్ యాప్‌లో యాడ్ అయ్యాయి.

చాటింగ్ మాత్రమే కాదు బ్రౌజింగ్ కూడా..

చాటింగ్ మాత్రమే కాదు బ్రౌజింగ్ కూడా..

Google Allo యాప్ ద్వారా ఒక్క చాటింగ్ మాత్రమే కాదు బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ బహుళ ఉపయోగకర స్మార్ట్ మెసేజింగ్ యాప్ గురించి 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్...

ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్...

Google Allo యాప్‌లో నిక్షిప్తం చేసిన గూగుల్ అసిస్టెంట్ అనేక విధాలుగా మీకు ఉపయోగపడుతుంది. గూగుల్ నౌ ఫీచర్‌కు ఎక్స్‌టెన్షన్‌గా పరిగణింపబడుతున్న ఈ ఫీచర్ ద్వారా విమానాల వివరాలు, రెస్టారెంట్ల వివరాలు తెలుసుకోవచ్చు.

స్మార్ట్ రిప్లై..

స్మార్ట్ రిప్లై..

Google Allo యాప్‌లో నిక్షిప్తం చేసిన మరో ఫీచర్ స్మార్ట్ రిప్లై. మీరు రిసీవ్ చేసుకున్న చివరి మెసేజ్ ఆధారంగా చేసుకుని ఈ ఫీచర్ కొన్ని రిప్లై సజెషన్స్ మీకు అందిస్తుం

Image recognition

Image recognition

Google Allo యాప్‌లో నిక్షిప్తం చేసిన స్మార్ట్ రిప్లై ఫీచర్ టెక్స్ట్ మెసేజ్‌లతో పాటు ఇమెజ్‌లను కూడా స్కాన్ చేసి రిప్లై సజెషన్స్ మీకు అందిస్తుంది. ఇది నిజంగా చాలా అద్బుతం.

Whisper Shout

Whisper Shout

Google Allo యాప్‌ ద్వారా మీరు పంపే మెసేజ్‌లకు అదనపు హంగులను జోడించుకోవచ్చు. యాప్‌లోని మెసేజ్ సెండ్ బటన్‌ను పైకి స్లైడ్ చేయటం ద్వారా మీ మెసేజ్‌కు ‘shout' ఎఫెక్ట్ వస్తుంది. టెక్స్ట్ సైజ్ పెద్దదవుతుంది. సెండ్ బటన్‌ను క్రిందకు స్లైడ్ చేయటం ద్వారా ‘whisper' ఎఫెక్ట్ వస్తుంది. టెక్స్ట్ సైజ్ చిన్నదవుతుంది.

Doodle on images

Doodle on images

Google Allo యాప్‌ ద్వారా మీరు పంపే ఫోటోల పై బొమ్మలను డ్రా చేయవచ్చు. పదాలను కూడా టైప్ చేయవచ్చు.

 End-to-end encryption

End-to-end encryption

Google Allo యాప్‌ ద్వారా మీరు పంపే మెసేజ్‌లకు End-to-end encryption ఉంటుంది. వీటిని కనీసం గూగుల్ కూడా చదవలేదు.

Incognito Mode

Incognito Mode

Google Allo యాప్‌‌లో ఏర్పాటు చేసిన Incognito Mode ఫీచర్ ద్వారా ప్రైవేట్ చాట్ సాధ్యమవుతుంది. ఈ మోడ్‌లో చాట్ చేస్తున్నపుడు సెండర్ పేరు మీద నోటిఫికేషన్స్ కూడా డిస్‌ప్లే అవ్వవు.

 స్టిక్కర్స్..

స్టిక్కర్స్..

Google Allo యాప్‌‌లో పదాలతో వ్యక్తం చేయలేని కొన్ని భావాలను స్టిక్కర్స్ ద్వారా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది.

Cross-platform support

Cross-platform support

Google Allo యాప్‌‌ ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌‍లను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఓఎస్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి యాప్‌‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Google Allo 2.0: 6 Interesting Features You Should Never Miss. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X