Android Oreo Go Edition గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్‌కు గాను 'గో ఎడిషన్'ను తాజాగా విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.
సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్‌కు గాను 'గో ఎడిషన్'ను తాజాగా విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో పనిచేసే ఈ కొత్త ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)ను 2017 మే నెలలోనే ఆవిష్కరించిన గూగుల్ సంస్థ దానిపై పూర్తి స్థాయి పరిశోధనలు జరిపి ఇప్పుడు మార్కెట్లోకి తీసుకువచ్చింది.దీని పని తీరుపై ఓ లుక్కేద్దాం.

తక్కువ ర్యామ్ సామర్థ్యం ఉన్న ఫోన్లలో..
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో గో ఎడిషన్‌ను ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లలో ఏర్పాటు చేసే విధంగా తీర్చిదిద్దారు. ఈ ఓఎస్ ముఖ్యంగా 1జీబీ, ర్యామ్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్ సామర్థ్యం కలిగిన స్మార్ట్‌ఫోన్లలో అతివేగంగా పనిచేస్తుంది.

సోర్స్ కోడ్..
ఈ ప్రత్యేక ఓఎస్‌కు చెందిన సోర్స్ కోడ్ ప్రస్తుతం మొబైల్ తయారీ కంపెనీలకు అందుబాటులో ఉన్నట్లు గూగుల్ ప్రతినిధులు వెల్లడించారు. ఇది ఒక టోన్డ్-డౌన్ వెర్షన్.

ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్‌లో..
ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్‌లో మీకు గూగుల్ గో, మ్యాప్స్ గో, జీమెయిల్ గో, యూట్యూబ్ గో, అసిస్టెంట్ గో, ఫైల్స్ గో లాంటి యాప్స్ లభిస్తాయి. ఇవి చాలా తక్కువ సైజులో ఉంటాయి. వీటి సహాయంతో తక్కువ ర్యామ్, ప్రాసెసర్ ఉన్నా సరే వేగంగా పనిచేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్లలోనూ ప్రీ ఇన్‌స్టాల్డ్ ..
ఇక ఈ ప్రత్యేక ఓఎస్‌తో రానున్న స్మార్ట్‌ఫోన్లలోనూ ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను తక్కువ మొత్తంలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో డివైస్‌లు వేగంగా పనిచేని చేసే అవకాశం ఉంది.

ఫైల్స్ గో యాప్..
ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్)లో కొత్త యాప్ కూడా ఉంది. అదే ‘ఫైల్స్ గో' యాప్. ఈ యాప్ పనితీరులో మూడు బేసిక్ ఫంక్షన్స్ ఉంటాయి. అందులో మెమెరీని ఖాళీ చేయడం.. పరిమితికి మించిన మెసేజ్‌లను డిలీట్ చేయడం దీని పని.

మెమెరీలోని ఫైళ్లను కనుక్కోవడం
అంతేకాదు మెమెరీలోని ఫైళ్లను కనుక్కోవడం, ఫొటోలతో పాటు ఇతర పైళ్ల సమాచారాన్ని ఆన్‌లైన్ లోకి వెళ్లడం లేకుండానే సమీపంలోని వ్యక్తికి అతివేగంగా చేరవేస్తుంది. ప్రస్తుతం ఈ యాప్ అన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌లకు గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోంది.

గూగుల్ గో..
ఈ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ వినియోదారులంతా తమ ఫోన్లలో టాప్ వెబ్‌సైట్లు, యాప్స్, ట్రెడింగ్ ఇమేజ్‌లు, గిఫ్ట్స్లలకు సంబంధించి తక్కువ విడిది పదాలతో సమాచారాన్ని వేగంగా తెలుసుకునేందుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. గూగుల్ గో' యాప్ సైజు 5 ఎంబీ వరకు ఉంటుంది.

డేటా షేరింగ్..
ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) డేటా షేరింగ్ ఫీచర్లతో కూడా వినియోగదారులు తమ డేటాను సేవ్ చేసుకునేందుకు కూడా దీన్ని ఫీచర్లు బాగుంటాయట. గూగుల్ క్రోమ్ వంటి పాపులర్ బ్రౌజర్లను కూడా తక్కువ ఫైల్ సైజుతో తమ ఫోన్లలో వేగంగా వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








