ప్లే స్టోర్‌లోకి గూగుల్ అసిస్టెంట్ యాప్

Posted By: BOMMU SIVANJANEYULU

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన లేటెస్ట్ Pixel స్మార్ట్‌ఫోన్‌లతో పాటు తన Google Assistant appను కూడా లాంచ్ చేసింది. ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ యాప్ షార్ట్ కట్‌లా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే మీ ఫోన్‌లో వాయిస్ అసిస్టెంట్ ఓపెన్ అయిపోతుంది. ఈ యాప్‌తో గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను మరింత సౌకర్యవంతంగా వినియోగించుకునే వీలుటుంది.

ప్లే స్టోర్‌లోకి గూగుల్ అసిస్టెంట్ యాప్

గూగుల్ ప్లే స్టోర్‌లో నూతనంగా లిస్ట్ అయిన ఈ యాప్, మీ ఆండ్రాయిడ్ డివైస్‌లో వర్క్ అవ్వాలంటే మీ డివైస్‌లో Google Search v7.11 వర్షన్‌తో పాటు యాప్ ఇన్‌స్టాల్ అయ్యేంత బేసిక్ మెమురీ స్పేస్ ఉంటే చాలు.

వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత స్మార్ట్‌ఫోన్ వినియోగంలో మరింత ఆధునీకత సంతరించుకుంది. గూగుల్ నౌ పేరుతో ఆండ్రాయిడ్ ఆఫర్ చేస్తున్న వాయిస్ అసిస్టెంట్ అప్లికేషన్ అనేక వాయిస్ రికగ్నిషన్ ఫీచర్‌లను కల్పిస్తోంది. నోటి మాట ఆధారంగా స్పందించే ఈ యాప్‌ స్మార్ట్ మొబైలింగ్‌ను మరింత సరళతరం చేసేసింది.

టెక్ దిగ్గజాల కోట్ల ఆదాయం వెనుక అన్నీ రక్తపు మరకలే, ఎవ్వరికీ తెలియని నిజాలు..

గూగుల్ వాయిస్ అసిస్టెంట్ యాప్ 'గూగుల్ నౌ'లో స్మార్ట్ కాలింగ్ ఫీచర్ ఆకట్టుకుంటోంది. ఈ ఫీచర్‌ను వినియోగించుకోవాలనుకుంటే ఫోన్‌లోని కాంటాక్ట్స్‌కు రిలేషన్‌షిప్ స్టేటస్‌ను యాడ్ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు మీ నాన్నగారికి కాల్ చేయలనుకుంటున్నారు, "Call Dad" అని గూగుల్ నౌకు కమాండ్ ఇస్తే సరి. గూగుల్ వాయిస్ అసిస్టెన్స్ ఆటోమెటిక్‌గా సంబంధిత కాంటాక్ట్‌ను శోధించి కాల్ చేస్తుంది.

గూగుల్ నౌ వాయిస్ అసిస్టెన్స్ యాప్ ద్వారా భాషను కూడా అనువాదం చేసుకోవచ్చు. ఉదాహరణకు 'నీటి’ని జపాన్ భాషలో ఏమంటారా తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే "How do you say water in Japanese?" అనే గూగుల్ నౌను అడిగితే సరిపోతుంది.

Read more about:
English summary
The Google Assistant app has been launched on the Play Store and works well with the supported Android devices.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot