Google Play Store విజయం వెనుక మహిళా శక్తి

Posted By: BOMMU SIVANJANEYULU

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ టెక్నాలజీ విభాగంలో రాణిస్తోన్న మహిళలకు తనదైన శైలిలో గుర్తింపును కల్పించే ప్రయత్నం చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ కోసం యాప్స్ అలానే గేమ్స్‌ను అభివృద్ధి చేసిన మహిళా డెవలపర్స్‌ విజయాలను ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమానికి గూగుల్ శ్రీకారం చుట్టింది. మార్చి మొదటి వారం నుంచి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా మహిళా డెవలపర్స్ అభివృద్ధి చేసిన గేమ్స్ అలానే అప్లికేషన్‌లను స్పెషల్ కలెక్షన్స్ రూపంలో గూగుల్ అందుబాటులో ఉంచింది. ఈ కలెక్షన్స్‌లో భాగంగా 80 డేస్, జెన్ కోయ్ 2, రేస్ ఫర్ ద గెలాక్సీ, కామీ 2 వంటి పాపులర్ ఉమెన్ డెవలపర్ గేమ్స్‌ను గూగుల్ అందుబాటులో ఉంచింది. వీటితో పాటు ఫిమేల్ లీడ్స్‌తో ఉన్న బుక్స్, మూవీస్ ఇంకా టీవీ షోలను గూగుల్ తన ప్లేస్టోర్‌లో ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టెక్నాలజీ విభాగంలో రాణించిన పలువురు శక్తివంతమైన మహిళామణుల వివరాలను మీకు తెలియజేస్తున్నాం.

మీ ఫోన్‌లో mAadhaar ఉందా..? అయితే ఇవి తెలుసుకోోండి ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షెరిల్ శాండ్‌బెర్గ్ (Sheryl Sandberg):

షెరిల్ శాండ్‌బెర్గ్ ఫేస్‌బుక్ తొలి మహిళా బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పట్టాను పొందిన షెరిల్ యూఎస్ ట్రెజరీ డిపార్ట్ బెంట్ ఇంకా గూగుల్ ఆన్‌లైన్ గ్లోబల్ సేల్స్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఉర్సులా బర్న్స్ (Ursula Burns):

జిరాక్స్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్‌గా తన కేరీర్‌ను ప్రారంభించిన ఆఫ్రో-అమెరికన్ జాతీయరాలు ఉర్సులా బర్న్స్ 2009లో ఆ కంపెనీకి సీఈవోగా ఎంపికయ్యారు. 2010లో చైర్మన్‌గా నియమతులయ్యారు. 1992 నుంచి 2000 వరకు ఈమె వివిధ బిజినెస్ బృందాలను లీడ్ చేశారు. పాలిటెక్నిక్ అలానే మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈమె ప్రావిణ్యాన్ని సాంపాదించారు.

మారిస్సా మేయర్ (Marissa Mayer):

ప్రస్తుతం అమెరికన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ హోదాలో కొనుసాగుతోన్న మారిస్సా మేయర్ గతంలో యాహూ కంపెనీకి సీఈవోగా ఉన్నారు. మారిస్సా మేయర్ యువ సీఈవోగా రికార్డుల్లో నిలిచారు. ఈమె సింబాలిక్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో డిగ్రీలను పొందారు. గూగుల్‌లో పని చేసిన తొలి మహిళా ఇంజనీర్ గా మారిస్సా గుర్తింపుపొందింది.

లిండా డిమైచీల్ (Linda DeMichiel):

కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించి స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్.డిని పొందిన లిండా టెక్నాలజీ ప్రపంచలో అంచలంచెలుగా ఎదుగుతున్న మహిళలకు స్పూర్తిగా నిలిచారు. ఈమె జావా ఈఈ ప్లాట్‌ఫామ్ గ్రూప్‌లో సీనియర్ ఆర్కిటెక్ట్‌గా కొనసాగుతున్నారు. ఓరాకిల్, జావా విభాగాల్లో లిండా డిమైచీల్ నిష్ణాతులు.

 

 

కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar-Shaw):

తొలి భారతీయ బయోటెక్ పారిశ్రామికవేత్తగా కిరణ్ మజుందార్ షా గుర్తింపు పొందారు. ఈమె 1978లో బయోకాన్ పేరుతో సంస్థను స్థాపించారు. ఆసియా హెల్త్ కేర్ మేగజైన్ కిరణ్ మజుందార్ షాను భారతదేశపు గ్లోబుల్ మహిళగా గుర్తించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Celebrating Women Behind Play Store's Best Apps, Games.Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot