ఇకపై వీడియోలన్నీమ్యూట్‌లోనే, గూగుల్ క్రోమ్ 64 వచ్చేసింది !

By Hazarath
|

గూగుల్ క్రోమ్ యూజర్లకోసం సరికొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా కొన్ని వెబ్‌సైట్‌లలో ఆటోప్లే అయ్యే వీడియోలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మీరు ఓపెన్ చేస్తున్న వెబ్‌సైట్లలో ఆటో ప్లే అయ్యే వీడియోలను ఇకపై మ్యూట్‌లోనే పెట్టేయవచ్చు.దీని కోసం మీరు సంబంధిత వెబ్‌సైట్‌ ట్యాబ్‌ పైన రైట్‌ క్లిక్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం ''మ్యూట్‌ సైట్‌'' అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీంతో డీఫాల్ట్‌గానే ఆటోప్లే అయ్యే అన్ని వీడియోలు ఆగిపోతాయని వెర్జ్‌ రిపోర్టులు పేర్కొన్నాయి.

 
ఇకపై వీడియోలన్నీమ్యూట్‌లోనే, గూగుల్ క్రోమ్ 64 వచ్చేసింది !

గత నవంబర్‌లోనే గూగుల్‌ ఈ సమస్యపై చర్చించి, దీనికి పరిష్కారంగా క్రోమ్‌ 64ను తీసుకొస్తున్నట్టు తెలిపింది. వెబ్‌సైట్‌లలో వచ్చే పాప్‌-అప్స్‌ను సమస్యపై కూడా గూగుల్‌ పరిష్కారం తీసుకొచ్చింది. పాప్‌-అప్స్‌ అనేవి మూడో వ్యక్తి కంటెంట్‌ కలిగి ఉన్న కొత్త పేజీలు. క్రోమ్‌ 64 వెబ్‌సైట్లను ప్రభావితం చేసే మెల్ట్డౌన్, స్పెక్టర్ భద్రతా లోపాలకు కూడా పరిష్కారం కనుగొంది.ఆండ్రాయిడ్ పోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్రోమ్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

క్రోమ్ వేగంపెరగాలంటే కింది సూచనలు పాటించండి..

ఢమాలైన చైనా మొబైల్ మార్కెట్ , 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే !ఢమాలైన చైనా మొబైల్ మార్కెట్ , 8 ఏళ్ల తర్వాత ఇప్పుడే !

టిప్ 1

టిప్ 1

అనవసరమైన ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. ప్లగిన్స్ కూడా ఇంచుమించుగా ఎక్స్‌టెన్షన్స్ మాదిరగానే ఉంటాయి. ఇవి మీ బ్రౌజర్‌ పనితీరును అదనంగా పెంచటంలో తోడ్పడతాయి. అయితే అవసరం లేని ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయాలంటే..? ముందు క్రోమ్ లొకేషన్ బార్‌లో "chrome://plugins"అని టైప్ చేయండి. - ఇప్పుడు మీ బ్రౌజర్‌తో అనుసంధానమైన ప్లగిన్స్ మీకు కనిపిస్తాయి. వీటిలో మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న plugins పై అన్ టిక్ చేసినట్లయితే ఎక్స్‌టెన్షన్స్ డిసేబుల్ కాబడతాయి.

టిప్ 2

టిప్ 2

అవసరం లేని ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేయాలంటే..? ముందు క్రోమ్ లొకేషన్ బార్ లో chrome://extensionsఅని టైప్ చేయండి. - ఇప్పుడు మీరు క్రోమ్ Options > More tools > Extensionsలోకి వెళతారు - ఇక్కడ మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న ఎక్స్‌టెన్షన్‌ల పై అన్ టిక్ చేసినట్లయితే ఎక్స్‌టెన్షన్స్ డిసేబుల్ కాబడతాయి.

టిప్ 3
 

టిప్ 3

పనికిరాని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఒక వెబ్ బ్రౌజర్ మాత్రమే కాదు, వెబ్ యాప్స్‌కు అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్ కూడా. లోకల్‌గా ఇన్‌స్టాల్ చేసిన HTML5, CSS, JavaScript యాప్స్‌తో కూడా ఈ బ్రౌజర్‌ను రన్ చేసుకోవచ్చు. మీ బ్రౌజర్‌లో అవసరం లేని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

Enable Prefetch Resources

Enable Prefetch Resources

 ప్రీఫెట్జ్ రిసోర్సులను ఎనేబుల్ చేసుకున్నట్లయితే.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేకమైన ఇంటెలిజెంట్ ఫీచర్లతో వస్తోంది. వీటిలో నెట్‌వర్క్ ప్రెడిక్షన్, స్పెల్లింగ్ కరెక్షన్, రిసోర్స్ ప్రీలోడర్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఈ రిసోర్స్ ప్రీ-ఫెట్చర్ ఫీచర్లు మీ ఓపెన్ చేసే వెబ్ పేజ్ లేదా లింక్స్‌కు సంబందించి తెలివైన సలహాలను అందిస్తాయి. వీటిని ఎనేబుల్ చేసుకోవటం ద్వారా మీ బ్రౌజర్ వినియోగం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రీఫెట్జ్ రిసోర్సులను ఎనేబుల్ చేసుకోవాలంటే..? క్రోమ్ ఆప్షన్స్ లోని Settings > Show advanced settingsలోకి వెళ్లండి "Prefetch resources to load pages more quickly" ఆప్షన్‌ను చెక్ చేయండి.

Experimental Canvas Features

Experimental Canvas Features

 క్రోమ్ బ్రౌజర్‌లోని Experimental Canvas ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా బ్రౌజర్ పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవచ్చు. Experimental Canvas ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవాలంటే..? ‘‘chrome://flags/#enable-experimental-canvas-features''లోకి వెళ్లండి. ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి.

Fast tab/window close

Fast tab/window close

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లోని Fast tab/window close ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా బ్రౌజర్ రెస్పాన్స్ టైమ్‌ను పెంచుకోవచ్చు. Fast tab/window close ఫీచర్ ను ఎనేబుల్ చేసుకోవాలంటే.. ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి. అడ్రస్ బార్‌లో "chrome://flags/#enable-fast-unload"అని టైప్ చేయండి.

 

Scroll Prediction

Scroll Prediction

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో నిక్షిప్తమై ఉన్న స్ర్కోల్ ప్రెడిక్షన్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా ఫింగర్స్ ఫ్యూచర్ పోజిషన్‌ను తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే లొకేషన్ బార్‌లో "chrome://flags/#enable-scroll-prediction"అని టైప్ చేయండి. ఎనేబుల్ బటన్ పై క్లిక్ చేసిన తరువాత Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Google Chromes v64 brings permanent solution for web pages with autoplay videos More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X