Google క్లాస్‌రూమ్‌లో త్వరలోనే తెలుగు భాష మద్దతు

|

లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి విద్యార్థులకు విద్యను బోధించడానికి దాదాపుగా ప్రతి విశ్వవిద్యాలయం మరియు పాఠశాలలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్ విధానం ద్వారా క్లాసులను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్ విద్యార్థుల యొక్క రోజువారీ సమస్యను పరిష్కరించడానికి కొత్త ఉత్పత్తులు మరియు పరిష్కారాలపై కృషి చేస్తుంది.

ఆన్‌లైన్ స్టడీయింగ్
 

ఆన్‌లైన్ స్టడీయింగ్

ఆన్‌లైన్ స్టడీయింగ్ మరింత సులభతరం చేయడానికి గూగుల్ సంస్థ గూగుల్ క్లాస్‌రూమ్‌ను ప్రారంభించింది. ఈ యాప్ యొక్క ముఖ్య లక్ష్యం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సులభంగా కమ్యూనికేట్ చేయడం. అలాగే వారి యొక్క హోమ్ వర్క్ వంటివి సమర్పించడానికి మరియు వాటిని గ్రేడ్ చేయడానికి సహాయపడటం. క్రొత్త అప్ డేట్ లో భాగంగా గూగుల్ ఇప్పుడు తన గూగుల్ క్లాస్‌రూమ్‌ను భారతీయ ప్రాంతీయ భాషలకు సపోర్ట్ చేయనుండి. ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో ధృవీకరించింది. గూగుల్ క్లాస్‌రూమ్ యాప్ యొక్క మరిన్ని ఫీచర్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఒకేసారి 49 మంది విద్యార్థుల పర్యవేక్షణతో  గూగుల్ క్లాస్‌రూమ్

ఒకేసారి 49 మంది విద్యార్థుల పర్యవేక్షణతో  గూగుల్ క్లాస్‌రూమ్

ఉపాధ్యాయులు ఏదైనా విషయాన్ని బోధించేటప్పుడు వారికి ఎదురయ్యే అతిపెద్ద సవాళ్ళలో ఒకటి విద్యార్థి పరధ్యానం చెందకుండా చూసుకోవడం మరియు అతను / ఆమె బోధించడానికి ప్రయత్నిస్తున్న దాన్ని అర్థం చేసుకోవడం. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా క్లాసులను నిర్వహించినప్పుడు ఇది కొద్దిగా కష్టమవుతుంది. కానీ గూగుల్ క్లాస్‌రూమ్‌ సహాయంతో ఉపాధ్యాయుడు ఒకేసారి 49 మంది విద్యార్థులను పర్యవేక్షించే అవకాశం ఉంది. 7 x 7 గ్రిడ్‌తో పెద్ద టైల్డ్ వ్యూ స్క్రీన్‌లో మొత్తం 49 బాక్స్ లను అనుమతిస్తుంది. దానితో పాటు విద్యార్థులు తమ ఆలోచనలను కూడా పంచుకోవాలనుకుంటే ఉపాధ్యాయుడు మీట్ లోపల జామ్‌బోర్డ్‌ను ఉపయోగించవచ్చు. 7 x 7 టైల్స్ ఫీచర్ మరియు జామ్‌బోర్డ్ రెండూ కూడా సెప్టెంబర్‌లో యాప్ తో అనుసంధానించబడతాయి.

Also Read:గూగుల్ కొత్త ఫీచర్, Online visiting కార్డులను సొంతంగా తయారుచేయడం ఎలా ?

గూగుల్ క్లాస్‌రూమ్‌లో ప్రాంతీయ భాషల మద్దతు
 

గూగుల్ క్లాస్‌రూమ్‌లో ప్రాంతీయ భాషల మద్దతు

గూగుల్ క్లాస్‌రూమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ముఖ్యమైన అప్ డేట్ లలో ఒకటి భారతీయ లోకల్ భాషలను చేర్చడం. గూగుల్ క్లాస్ రూమ్ లో ఇప్పుడు బెంగాలీ, తెలుగు, ఉర్దూ, మరాఠీ మరియు తమిళ వంటి ప్రాంతీయ భాషలు చేర్చబడ్డాయి. అయితే ఈ ఫీచర్ ఇంకా ప్రారంభించబడలేదు కాబట్టి వినియోగదారులు ప్రాంతీయ భాషల మద్దతును చూడటానికి మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది.

గూగుల్ క్లాస్‌రూమ్‌లో మరిన్ని అప్ డేట్స్

గూగుల్ క్లాస్‌రూమ్‌లో మరిన్ని అప్ డేట్స్

గూగుల్ క్లాస్‌రూమ్‌లో చాలా మంది ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న మరొక కొత్త అప్ డేట్ స్టూడెంట్ ఎంగేజ్‌మెంట్ మెట్రిక్స్. ఆన్‌లైన్ తరగతితో ఒక విద్యార్థి ఎంతవరకు సంభాషిస్తున్నాడో తెలుసుకోవడానికి ఇది ఉపాధ్యాయులకు మరియు సంస్థలకు సహాయపడుతుంది. విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో నేర్చుకోవడం మరియు బోధించడం యొక్క మంచి అనుభవాన్ని అందించడానికి గూగుల్ క్లాస్‌రూమ్‌ యాప్ కి సంస్థ మరిన్ని లక్షణాలను తీసుకువస్తుంది అని ఆశించవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Google Classroom Support Multiple Indian Languages Soon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X