4 రోజుల్లో కోటిమంది డౌన్‌లోడ్ చేసుకున్న వీడియో కాలింగ్ యాప్ ఇదే!

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం కొద్ది రోజుల క్రితం లాంచ్ చేసిన వీడియో కాలింగ్ యాప్ Duoను ఇప్పటి వరకు 10 మిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్లు గూగుల్ ప్రొడక్ట్ లీడ్ అమిత్ ఫులే ఒక ప్రకటనలో తెలిపారు.

Read More : మీ ఏరియాలో Jio 4G నెట్‌వర్క్ కవరేజ్‌ను చెక్ చేయటం ఎలా..?

4 రోజుల్లో కోటిమంది డౌన్‌లోడ్ చేసుకున్న వీడియో కాలింగ్ యాప్ ఇదే!

Google Play స్టోర్ అందుబాటులో ఉన్న అన్ని దేశాల్లోDuo యాప్ ఉచితంగా లభ్యమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆ యాప్స్‌కు ధీటుగా

ఫేస్‌టైమ్, స్కైప్, వైబర్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌కు ధీటుగా గూగుల్ ఈ డ్యుయో యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఆండ్రాయిడ్, యాపిల్

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో, యాపిల్ ఐఓఎస్ ఫోన్‌లను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది.

సులభతరమైన వీడియో కాలింగ్‌‌

ఈ యాప్ ద్వారా సులభతరమైన వీడియో కాలింగ్‌‌ను తమ ఆండ్రాయిడ్ యూజర్లకు అందించాలన్నది గూగుల్ లక్ష్యం.

ఎటువంటి యూజర్ నేమ్స్

ఈ యాప్‌ను ఉపయోగించుకునేందుకు ఎటువంటి  ప్రత్యేకమైన యూజర్ నేమ్స్ ఇంకా పాస్‌వర్డ్స్ అవసరం ఉండదు. యూజర్ తన మొబైల్ నెంబర్ ధ్వారా డ్యుయో వీడియో కాల్స్ చేసుకోవచ్చు.

ఇంటర్నెట్ బలహీనంగా ఉన్నప్పటికి

ఇంటర్నెట్ కనెక్టువిటి బలహీనంగా ఉన్నప్పటికి ఈ యాప్ కట్ అవకుండా పనిచేస్తుందని గూగుల్ చెబుతోంది.

'నాక్ నాక్'

 'నాక్ నాక్' అనే సరికొత్త ఫీచర్‌ను గూగుల్ తన డ్యుయో యాప్‌లో పొందుపరిచింది. ఈ ఫీచర్ ద్వారా కాల్ లిఫ్ట్ చేయక ముందే కాల్ చేసిన వారి లైవ్ వీడియోను మనం చూడొచ్చు.

హైడెఫినిషన్ క్వాలిటీ

డ్యుయో వీడియో కాలింగ్ యాప్ హైడెఫినిషన్ క్వాలిటీతో వీడియో కాలింగ్‌ను ఆఫర్ చేస్తుంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Duo Video Calling App Touches 10 Million Downloads on Android. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot