వినియోగదారులకు కోడ్ నేర్పించే పనిలో గూగుల్ ఉద్యోగులు

గూగుల్ కంపెనీ యొక్క ఏరియా 120 - ఇంటర్నేషనల్ ఇంక్యుబేటర్ లో ఉన్న గూగుల్ ఉద్యోగులు కొందరు గ్రాస్హాపర్ (grasshopper) అనే అప్లికేషన్ ను లాంచ్ చేసారు.

|

గూగుల్ కంపెనీ యొక్క ఏరియా 120 - ఇంటర్నేషనల్ ఇంక్యుబేటర్ లో ఉన్న గూగుల్ ఉద్యోగులు కొందరు గ్రాస్హాపర్ (grasshopper) అనే అప్లికేషన్ ను లాంచ్ చేసారు. ఇది ఆండ్రాయిడ్ మరియు IOS వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఈ అప్లికేషన్ వినియోగదారులకు బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇవ్వడంలో సహాయం చేస్తుంది. ఇక్కడ ఏరియా 120 అనేది గూగుల్ యొక్క సొంత స్టార్టప్ కంపెనీ. తమ ఉద్యోగుల తెలివితేటలు కంపెనీ నుండి వెళ్ళకుండా, ఈ స్టార్టప్ కంపెనీ ద్వారా వారి తెలివితేటలకు పదును కల్పించే పనిలో భాగంగా ఈ ఏరియా 120 ను ఏర్పాటు చేసింది. ఇందులో గూగుల్ మెయిన్ ప్రాజెక్ట్స్ కాకుండా మొదట్లో సైడ్ ప్రాజెక్ట్స్ ఇస్తూ వచ్చేది. కానీ ఈ గ్రాస్హాపర్ వీరికి ప్రధాన ప్రాజెక్ట్ గా తయారయింది అని అర్ధమవుతూ ఉంది.

 
google

మంచి యూసర్ ఇంటర్ఫేస్ తో అందరికీ అర్ధమయ్యేలా ఈ అప్లికేషన్ రూపొందించబడింది. ఈ అప్లికేషన్ వినియోగదారులను కొన్ని చిన్న చిన్న ప్రశ్నలను అడగడం లేదా , క్విజ్ , చాలెంజ్ వంటి తదితర అంశాలతో నిండి ఉంటుంది. తద్వారా బేసిక్ జావా స్క్రిప్ట్ సైతం త్వరగానే అర్ధమయ్యే రీతిలో పొందుపరచబడింది. ఆటను తలపించే విధంగా ఉన్న ఈ పయనీర్ గ్రాస్హాపర్ అప్లికేషన్, ప్రస్తుతానికి మూడు ప్రోగ్రామింగ్ సెట్స్ అద్యాయాలను కలిగి ఉంది. ఇవి కాలింగ్ ఫంక్షన్స్ , వేరియబుల్స్ వినియోగం, ఆబ్జెక్ట్ వంటి బేసిక్ ఫండమెంటల్ కోడింగ్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మంచి యానిమేషన్స్ తో అందంగా తీర్చిదిద్దబడి ఉంటుంది.

 

కేవలo కొద్ది నిమిషాల సమయం వెచ్చించడం ద్వారా, కొన్ని చాలెంజ్లను పూర్తి చేయడం ద్వారా ప్రోగ్రామింగ్ బేసిక్ నాలెడ్జ్ ఇచ్చేలా ఈ అప్లికేషన్ ఉండడం ఎందరికో ఉపయోగకరంగా ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. అప్లికేషన్ రిమైండర్ వినియోగించి రోజులో రిమైండర్ సెట్ చేయబడిన సమయంలో చాలెంజ్లను పూర్తి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

గ్రాస్హాపర్ లోని చాలెంజ్లను పూర్తి చేసాక, coursera క్లాసులకు సిఫార్సు చేయబడుతుంది. తద్వారా వినియోగదారుల అభీష్టం మేరకు జావా స్క్రిప్ట్, HTML, CSS , algorithms, మరియు వెబ్ డిజైనింగ్ వంటి అనేక అంశాలను కొంత అమౌంట్ చెల్లించడం ద్వారా పూర్తిగా నేర్చుకునే వెసులుబాటు కల్పించబడినది కూడా. గ్రాస్ హాపర్ ఆన్లైన్ ప్లే గ్రౌండ్ (https://jsfiddle.net/Grasshopper_explainer/tuusppf5/) ద్వారా సొంత JS ఆనిమేషన్స్ చేసుకోగల అవకాశo కూడా ఉన్నది. సహజంగా కోడింగ్ నేర్చుకోవడానికి ప్రత్యామ్నాయంగా edX మరియు FreeCodeCamp వంటి ఇతర టూల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

డ్యూయెల్ సిమ్ సపోర్ట్‌తో ఐఫోన్, అత్యంత తక్కువ ధరకే !డ్యూయెల్ సిమ్ సపోర్ట్‌తో ఐఫోన్, అత్యంత తక్కువ ధరకే !

హైస్కూల్ స్టడీ పూర్తిచేశాక, ఈ అప్లికేషన్ లో కొన్ని చాలెంజులు పూర్తి చేయడం ద్వారా సబ్జెక్ట్ సంబంధించిన విషయాలపై అవగాహన పెంపొందే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా అప్లికేషన్స్ లో స్క్రోల్ డౌన్ ఫీడ్ల కన్నా, ఈ అప్లికేషన్ వినియోగం మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది అని చెప్పవచ్చు. మరియు ఒక ఆటవలె, కోడింగ్ నేర్చుకునే వెసులుబాటు ఉంటుంది.

ఏరియా 120 నుండి వచ్చిన ఈ గ్రాస్హాపర్ , గూగుల్ ఉద్యోగులకు సైడ్ ప్రాజెక్ట్ ను ఫుల్ టైం ప్రాజెక్ట్ గా మార్చుకునేలా సహాయం చేసింది అని చెప్పవచ్చు. ఈ ఏరియా120, గ్రాస్హాపర్ కంటే ముందుగా, uptime, మరియు సూపర్ సోనిక్ అప్లికేషన్లను కూడా లాంచ్ చేసిoది. ఇక్కడ uptime లో యూట్యూబ్ వీడియోలను సింక్ చేసుకుని చూసే వెసులుబాటుతో సహా , మీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్నేహితులతో పంచుకునే అవకాశం కూడా ఉన్నది. మరియు supersonic అప్లికేషన్ ఎమోజీ ప్రేమికులకి మెసేజింగ్ సర్వీసును అందించేదిలా ఉంటుంది.

Best Mobiles in India

English summary
Google employees want to teach you to code for free with their cute new app more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X