Home
Apps

Duo V30 అప్‌డేట్‌ను నిలిపివేసిన గూగుల్!

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన సర్వీసెస్ అలానే డివైస్‌లకు సంబంధించి క్రమం తప్పకుండా అప్‌డేట్‌లను లాంచ్ చేస్తోన్న విషయం తెలిసిందే.

By Bommu Sivanjaneyulu

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తన సర్వీసెస్ అలానే డివైస్‌లకు సంబంధించి క్రమం తప్పకుండా అప్‌డేట్‌లను లాంచ్ చేస్తోన్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విజయవంతంగా స్పందిస్తుంటే మరికొన్ని మాత్రం లేనిపోని సమస్యలను సృష్టిస్తున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే గూగుల్ డ్యుయో వీ30 అప్‌డేట్. ఈ అప్‌డేట్ లేనిపోని సమస్యలను క్రియేట్ చేస్తుండటంతో గూగుల్ అర్థంతరంగా నిలిపివేసినట్ల తెలుస్తోంది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం గూగుల్ ఈ అప్‌డేట్‌ను పూర్తిగా పక్కన పెట్టింది.

డ్యుయో యాప్ యూజర్లు ఈ అప్‌డేట్‌ను తీసుకోవటం ద్వారా కాల్ సౌండ్ తక్కువుగా వస్తోంది. దీంతో కాల్స్ చేసేకునే సమయంలో అనేక అవాంతరాలు ఎదురవుతున్నట్లు యూజర్లు వాపోతున్నారు. ఈ సమస్యను ఫేస్ చేస్తున్న వారు తిరిగి v29.2 అప్‌డేట్‌లోకి వెళ్లిపోవటం ద్వారా బగ్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయని గూగుల్ డ్యుయో లీడ్ ఇంజినీర్ జస్టిన్ ఉబెర్టి తెలిపారు.

google

సులభతరమైన వీడియో కాలింగ్‌‌..
గూగల్ డ్యుయో ద్వారా సులభతరమైన వీడియో కాలింగ్‌‌ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందించాలన్నది గూగుల్ లక్ష్యం. ఈ యాప్‌ను ఉపయోగించుకునేందుకు ఎటువంటి ప్రత్యేకమైన యూజర్ నేమ్స్ ఇంకా పాస్‌వర్డ్స్ అవసరం ఉండదు. యూజర్ తన మొబైల్ నెంబర్ ధ్వారా డ్యుయో వీడియో కాల్స్ చేసుకునే వీలుంటుంది. ఇంటర్నెట్ కనెక్టువిటి బలహీనంగా ఉన్నప్పటికి ఈ యాప్ ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చని గూగుల్ చెబుతోంది. డ్యుయో వీడియో కాలింగ్ యాప్ హైడెఫినిషన్ క్వాలిటీతో వీడియో కాలింగ్‌ను ఆఫర్ చేస్తుంది. 'నాక్ నాక్' అనే సరికొత్త ఫీచర్‌ ఈ యాప్‌కు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది.

చేసిన వారి లైవ్ వీడియోను చూడొచ్చు..
ఈ ఫీచర్ ద్వారా కాల్ లిఫ్ట్ చేయక ముందే కాల్ చేసిన వారి లైవ్ వీడియోను మనం చూడొచ్చు. ఫీచర్ల పరంగా Google Duo యాప్‌ను వాట్సాప్ ఇంకా హైక్ మెసెంజర్‌ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్‌లతో కంపేర్‌చేసి చూసినట్లయితే వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వాట్సాప్, హైక్ మెసెంజర్ యాప్‌లలో ఏర్పాటు చేసిన వీడియో కాలింగ్ సదుపాయాన్ని యూజర్లు సింగిల్ క్లిక్‌తో పొందవచ్చు.

google

కేవలం వీడియో కాలింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది...
గూగుల్ డ్యుయో యాప్‌ను కేవలం వీడియో కాలింగ్‌కు మాత్రమే డిజైన్ చేయటం జరిగింది. ఇదే సమయంలో వాట్సాప్, హైక్ మెసెంజర్ యాప్స్ ద్వారా వీడియో కాల్స్‌తో పాటు వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెసెజ్‌లు పంపుకోవచ్చు, ఫోటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా సదుపాయాలు ఈ రెండు యాప్‌లలో కొలువుతీరి ఉండటం విశేషం.

Best Mobiles in India

English summary
Google has stopped rolling out the version 30 update due to some call bug which is impacting the performance of the app is causing low call volume issue. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X