ప్లే స్టోర్ నుండి 500 యాప్స్‌ను తొలగించిన గూగుల్
గూగుల్ సంస్థ తన ప్లే స్టోర్ నుంచి 500 ఆండ్రాయిడ్ యాప్స్‌ను తొలగించింది.
గూగుల్ సంస్థ తన ప్లే స్టోర్ నుంచి 500 ఆండ్రాయిడ్ యాప్స్‌ను తొలగించింది. సదరు యాప్స్ సహాయంతో వినియోగదారుల ఫోన్లలో ఉన్న డేటాను సులభంగా తస్కరించేందుకు వీలుంటుందని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ లుకౌట్ వెల్లడించింది.

దీంతో ఆ యాప్స్‌ను పరిశీలించిన గూగుల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గూగుల్ తొలగించిన 500 యాప్స్‌లో ఎక్కువగా గేమ్స్ ఉండగా, తరువాతి స్థానాల్లో వరుసగా వాతావరణం, ఆన్‌లైన్ రేడియో, ఫొటో ఎడిటింగ్, ఎడ్యుకేషన్, హెల్త్, ఫిట్‌నెస్, వీడియో కెమెరా అంశాలకు చెందిన యాప్స్ ఉన్నాయి.

కాగా తొలగించిన యాప్స్ ఇకపై ప్లే స్టోర్‌లో కనిపించవని గూగుల్ వెల్లడించింది. అయితే ఆ యాప్స్ లిస్ట్‌ను మాత్రం గూగుల్ బయటపెట్టలేదు.


Click it and Unblock the Notifications








