Google బంప‌రాఫ‌ర్.. ఇక‌ ఇంట‌ర్నెట్ లేకున్నా జీమెయిల్ సేవ‌లు పొందొచ్చు..!

|

ప్ర‌ముఖ ఇంట‌ర్నెట్ సెర్చింజ‌న్ గూగుల్ (Google) వినియోగ‌దారుల‌కు శుభవార్త చెప్పింది. జీమెయిల్ (Gmail) లో ఆఫ్‌లైన్ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెస్తున్న‌ట్లు సెర్చింజ‌న్ ప్ర‌క‌టించింది. ఈ ఫీచ‌ర్ ద్వారా వినియోగ‌దారులు ఇక ఇక త‌మ మొబైల్‌లో ఇంట‌ర్నెట్ లేక‌పోయినా, సిగ్న‌ల్ స‌రిగా లేక‌పోయినా కూడా మెయిల్స్ పంప‌వ‌చ్చు, త‌మ‌కు వ‌చ్చిన మెయిల్స్‌ను కూడా చూసుకోవ‌చ్చు. ఈ మేర‌కు కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గ‌జ సంస్థ మౌంటెన్ వ్యూ వెల్ల‌డించింది.

మౌంటెన్ వ్యూ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గూగుల్ Google సంస్థ జీ మెయిల్‌లో ఆఫ్‌లైన్ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచ‌ర్ ద్వారా Gmail వినియోగ‌దారులు ఇంట‌ర్నెట్ లేక‌పోయినా త‌మకు వ‌చ్చిన మెయిల్స్‌ను చూసుకోవ‌చ్చు.. వాటికి ప్ర‌తిస్పందించ‌వ‌చ్చు. ఈ Gmail ఆఫ్‌లైన్ ఫీచ‌ర్‌ను మీరు కూడా సులువుగా యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. అందుకు ఈ కింది స్టెప్స్‌ను ఫాలో కావాల్సి ఉంటుంది.

gmail offline feature

Gmail ఆఫ్‌లైన్ ఫీచ‌ర్‌ను పొందేందుకు ఈ స్టెప్స్‌ను అనుస‌రించండి:
*
ముందుగా జీ మెయిల్ లోకి సైన్ ఇన్ అవ్వాలి. అయితే ఈ ఆఫ్‌లైన్ ఫీచ‌ర్ అనేది కేవ‌లం గూగుల్ క్రోమ్‌లో మాత్ర‌మే ప‌నిచేస్తుంద‌ని గూగుల్ వెల్ల‌డించింది. అది కూడా క్రోమ్ నార్మ‌ల్ మోడ్‌లోనే ప‌నిచేస్తుంది. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ప‌నిచేయ‌దు.
* జీమెయిల్ Gmail ఇన్‌బాక్స్‌లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత సెట్టింగ్స్ లేదా కాగ్ వీల్ బ‌ట‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత "See All Settings" ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* అనంత‌రం "ఎనేబుల్ ఆఫ్‌లైన్ మెయిల్" అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత స్టెప్‌లో సేవ్ ఛేంజెస్ అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్‌ను ఎనేబుల్ చేసిన త‌ర్వాత మీరు జీ మెయిల్ ఆఫ్‌లైన్‌ స‌ర్వీసుల్ని వినియోగించుకోవ‌చ్చు.

గూగుల్‌కు చెందిన జీ మెయిల్ సేవ‌ల్ని దాదాపు 1.8 బిలియ‌న్ మంది వినియోగిస్తున్నారు. ఈ మెయిల్ క్ల‌యింట్ మార్కెట్‌లో గూగుల్ మెయిల్ 18 శాతం మార్కెట్ షేర్ క‌లిగి ఉంది. జీమెయిల్ ను వినియోగిస్తున్న వారిలో దాదాపు 75శాతం మంది మొబైల్స్ లోనే వినియోగిస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకునే జీ మెయిల్ ఈ ఆఫ్‌లైన్‌ ఫీచ‌ర్‌ను తెచ్చిన‌ట్లు తెలుస్తోంది.

gmail offline feature

అదేవిధంగా మ‌నం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌లో గూగుల్ చాట్ ఫీచ‌ర్‌ను యాక్టివేట్ చేసే విధానం తెలుసుకుందాం:
** మీ Gmail అకౌంటును ఓపెన్ చేసి సెట్టింగ్‌ల విభాగంకు వెళ్లండి.
** ఎడమవైపు ఎగువభాగంలో మూలలో ఉన్న మూడు-లైన్ చిహ్నాన్ని నొక్కండి. క్రిందికి స్క్రోల్ చేసి "సెట్టింగ్స్" ఎంపికను ఎంచుకోండి.
** తర్వాత మీ అకౌంటును ఎంచుకుని "జనరల్" ఎంపికకి నావిగేట్ చేయండి.
** ఆండ్రాయిడ్ టోగుల్ కోసం "షో ది చాట్ & స్పేస్‌ ట్యాబ్‌" ఎంపికను ఎంచుకోండి. మీరు iOS పరికరాన్ని ఉపయోగిస్తుంటే కనుక "షో చాట్ & స్పేస్ ట్యాబ్‌ను"ని ఆన్ చేయండి.
** దీనిని అనుసరించడం ద్వారా మీరు స్క్రీన్ దిగువన చాట్ మరియు స్పేస్‌ల చిహ్నాలను చూస్తారు.

gmail offline feature

వెబ్ బ్రౌజర్‌లో గూగుల్ చాట్ ని యాక్టివేట్ చేసే విధానం:
** మీ Gmail అకౌంటును ఓపెన్ చేసి సెట్టింగ్‌ల విభాగంకు వెళ్లండి.
** తరువాత "సి ఆల్ సెట్టింగ్స్ " ఎంపికను ఎంచుకోండి.
** ఆ తర్వాత టాప్ మెనూలో "చాట్ మరియు మీట్" ఎంపికను ఎంచుకోండి.
** మీకు "గూగుల్ చాట్," "క్లాసిక్ హ్యాంగ్ ఔట్స్" మరియు "ఆఫ్" ఎంపిక ఎంపిక ఇవ్వబడుతుంది.
** తరువాత మీరు మీ Gmail ఇన్‌బాక్స్‌కు కుడి వైపున మీ చాట్‌లు మరియు రూమ్స్ కోసం సైడ్‌బార్‌ను చూస్తారు.

Best Mobiles in India

English summary
Google Introduces Offline Gmail

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X