గూగుల్ నుంచి అదిరిపోయే ఫీచర్ వస్తోంది

గూగుల్ నుంచి సరికొత్త టూల్ అందుబాటులోకి రాబోతోంది. జూన్ 28న రిలీజ్ కాబోతోన్న ఈ టూల్ ద్వారా గూగుల్ యూజర్లు తమ డెస్క్‌టాప్ నుంచే అన్ని ఫైల్స్‌ను బ్యాకప్ చేసుకునే వీలుంటుంది. Backup and Sync పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది.

గూగుల్ నుంచి అదిరిపోయే ఫీచర్ వస్తోంది

విండోస్ అలానే మ్యాక్ యూజర్లను ఉద్దేశించి డిజైన్ చేయబడిన ఈ లేటెస్ట్ వర్షన్ యాప్ ఇప్పటికే అందుబాటులో ఉన్న స్టాండర్డ్ గూగుల్ డ్రైవ్ యాప్ అలానే గూగుల్ ఫోటోస్ బ్యాకప్ యాప్‌లను రీప్లేస్ చేసేస్తుంది. గూగుల్ Backup and Sync టూల్‌ను ఉపయోగించుకోవటం ద్వారా డెస్క్‌టాప్ అలానే ల్యాప్‌టాప్ యూజర్లు తమ రోజువారి వర్క్‌ను తమ గూగుల్ డ్రైవ్ అకౌంట్‌లోకి బ్యాకప్ చేసుకుని తిరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. ఈ టూల్ గూగుల్ ఫోటోస్ డెస్క్‌టాప్ అప్‌లోడర్‌కు ఇంటిగ్రేట్ అయి ఉంటుంది.

గూగుల్ నుంచి అదిరిపోయే ఫీచర్ వస్తోంది

Backup and Sync టూల్‌ను డెస్క్‌టాప్ పై లాంచ్ చేసిన తరువాత ఏ గూగుల్ అకౌంట్ లోకైతే ఫైళ్లను బ్యాక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి టూల్‌కు మన కంప్యూటర్ వివరాలను అటాచ్ చేయవల్సి ఉంటుంది.

English summary
Google to launch new Backup and Sync tool for files and photos. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot