Home
Apps

టిక్‌టాక్‌కు పోటీగా గూగుల్ షార్ట్ వీడియో యాప్ "టాంగి"

టిక్‌టాక్‌కు పోటీగా గూగుల్ సంస్థ టాంగి అనే వీడియో యాప్ ను విడుదల చేసింది. 2019 లో టిక్‌టాక్‌ ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ లలో రెండవ స్థానంను సాధించింది. ఇప్పుడు టిక్‌టాక్‌ను ఎదురుకోవడానికి సెర్చ్ దిగ్గజం గూగుల్ తన షార్ట్- ఫార్మ్ వీడియో టాంగి యాప్ ను ప్రారంభించింది.

టాంగి

టాంగి యాప్ గూగుల్ యొక్క ఇంక్యుబేటర్ ఏరియా 120 చే అభివృద్ధి చేయబడింది. ఇది ఒక ప్రయోగాత్మక సామాజిక వీడియోను షేర్ చేయగల యాప్. ప్రతిరోజూ క్రొత్త విషయాలను త్వరగా DIY వీడియోలతో తెలుసుకోవడానికి ప్రజలకు ఈ యాప్ సహాయపడుతుంది.

 

 

షార్ట్- ఫార్మ్ వీడియో టాంగి

గూగుల్ యొక్క షార్ట్- ఫార్మ్ వీడియో టాంగి యాప్ వ్యవస్థాపకుడు కోకో మావో దీని గురించి అనేక విషయాలను పంచుకున్నాడు. ఈ యాప్ యొక్క పేరు "TeAch aNd GIve" మరియు "tangible" పదాల ద్వారా ప్రేరణ పొంది తీసుకున్నారు. ఈ కొత్త టిక్‌టాక్ ప్రత్యర్థి గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

గూగుల్

ప్రయోగాత్మక ప్రాజెక్టుల కోసం గూగుల్ సంస్థ యొక్క ఏరియా 120 ఇన్-హౌస్ ఇంక్యుబేటర్ ల్యాబ్ దీనిని తయారుచేసింది. టాంగి యాప్ ప్రతిరోజూ క్రొత్త విషయాలను తెలుసుకోవడానికి ఒక సోషల్ వీడియో షేరింగ్ యాప్ ల ఉంటుంది. మీరు కూడా మీ యొక్క కళాత్మక, DIY, వంట మరియు స్టైలింగ్ వంటి నైపుణ్యాలను 60 సెకన్లలోపు రికార్డు చేసి షేర్ చేయవచ్చు.

 

 

సోషల్ మీడియా

ఇంతకు ముందు మీరు చేసిన ప్రాజెక్ట్‌లను తిరిగి సోషల్ మీడియాతో పంచుకోవడానికి గూగుల్ యొక్క టాంగి యాప్ తో మళ్ళి ప్రయత్నించండి. ఇది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. టాంగి యాప్ లో వీడియోలను సృష్టించడానికి సృజనాత్మక ప్రేరణను పొందగల అనేక ఫీచర్లను కలిగి ఉన్నది.

 

 

Google టాంగి యాప్

** Google టాంగి యాప్ నిలువు వరుసలో వీడియోలను స్క్రోల్‌లో చూపిస్తుంది.

** టాంగిలోని వీడియోలు ఒక నిమిషం (60 సెకన్లు) లాంగ్ ను కలిగి ఉంటాయి. అయితే తక్కువ సమయం గల వీడియోలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ప్రతి వీడియో పైన దాని యొక్క వ్యవధిని చూపుతుంది.

** ప్రస్తుతానికి టాంగి యూరోపియన్ యూనియన్ మినహా ప్రతిచోటా అందుబాటులో ఉంది.

** గూగుల్ యొక్క టాంగి యాప్ ఆపిల్ యాప్ స్టోర్ మరియు iOS లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది.

** ఆశ్చర్యకరంగా ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అలాగే ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ఈ యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అన్న దాని మీద ఎటువంటి సమాచారం లేదు.

** టాంగి యాప్ 'ట్రియేట్ ఇట్' ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది ట్యుటోరియల్‌ను పున:సృష్టి చేయడానికి మరియు షేర్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

** ప్రస్తుతానికి అప్‌లోడ్ చేసే సామర్థ్యం అందరికీ అందుబాటులో లేదని గూగుల్ తెలిపింది. పూర్తి యాక్సిస్ ను పొందడానికి వినియోగదారులు వెయిట్‌లిస్ట్‌లో చేరాలి.

 

Best Mobiles in India

English summary
Google Launched Tangi Short Video App to Compete With TikTok
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X