గూగుల్ కొత్త యాప్, మీ డేటా ఇకపై సేవ్ !

Written By:

గూగుల్ రోజు రోజుకు కొత్త యాప్‌లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల యాప్‌లను రిలీజ్ చేసిన గూగుల్ మరో సరికొత్త యాప్‌ను రిలీజ్ చేసింది. మీ మొబైల్ డేటా నియంత్రణ కోసం Datally పేరుతో ఓ కొత్త యాప్‌ని తీసుకొచ్చింది. గూగుల్‌ సంబంధిత నెక్స్ట్‌ బిలియన్‌ యూజర్స్‌ దీనిని సృష్టించింది.

అమెజాన్‌లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు, 9వ తేదీ వరకే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్‌ డేటా వాడకాన్ని..

మీరు ఈ యాప్ ద్వారా మొబైల్‌ డేటా వాడకాన్ని నియంత్రణ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ద్వారా వినియోగదారుడు ఎంత డేటాను వాడాడో తెలుసుకుని.. తద్వారా డేటాను సేవ్‌ చేసుకోవచ్చు.

Source : androidauthority

వాడని యాప్‌ల డేటాను..

దీంతో పాటు వాడని యాప్‌ల డేటాను వాడకుండా ఈ యాప్ కంట్రోల్ చేస్తుంది. తద్వారా మీరు మరింతగా డేటాను కంట్రోల్ చేసుకోవచ్చు.
Source : androidauthority

30 శాతం మొబైల్ డేటా సేవ్

కొన్నిసార్లు వాడకపోయినప్పటికీ.. బ్యాక్‌ గ్రౌండ్‌లో కొన్ని యాప్‌లు డేటాను ఆటోమేటిక్‌ ఉపయోగించుకున్న విషయం తెలిసిందే. దీని ద్వారా దాదాపు 30 శాతం మొబైల్ డేటాను సేవ్ చేసే స‌దుపాయం క‌లుగుతుంది.

ద‌గ్గ‌ర‌లో ఉన్న వైఫై నెట్‌వ‌ర్క్‌ల‌ను..

అలాగే ఈ యాప్ ద్వారా ద‌గ్గ‌ర‌లో ఉన్న వైఫై నెట్‌వ‌ర్క్‌ల‌ను క‌నిపెట్టవ‌చ్చు. నాణ్య‌మైన ఇంట‌ర్నెట్ వేగాన్ని అందించే నెట్‌వ‌ర్క్‌ల‌ను ఈ యాప్ ద్వారా ఎంచుకోవ‌చ్చు.

లింక్

ప్రస్తుతం ఆండ్రాయిడ్ 5.0 ఆపైన వర్షన్ ఉన్న ఫోన్లలో.. ప్లేస్టోర్‌లో ఈ యాప్‌ అందుబాటులో ఉంది.ఈ లింక్ మీద క్లిక్ చేసి పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google launches Datally app to manage and save mobile data Read more News at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting