గూగుల్ నుంచి సరికొత్త ఫోటోగ్రఫీ యాప్స్

Posted By: BOMMU SIVANJANEYULU

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ మూడు సరికొత్త ఫోటోగ్రఫీ అప్లికేషన్‌లను అనౌన్స్ చేసింది. స్టోరీ బోర్డ్ (ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే), సెల్ఫిస్మో (ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్), స్ర్కబ్బీస్ (ఐఓఎస్ యూజర్లకు మాత్రమే) పేర్లతో ఈ యాప్స్ అందుబాటులో ఉంటాయి. యాప్స్‌పిరిమెంట్స్ ప్రోగ్రామ్ క్రింద గూగుల్ ఈ యాప్‌లను లాంచ్ చేసింది.

గూగుల్ నుంచి సరికొత్త ఫోటోగ్రఫీ యాప్స్

వీటిలో మొదటి యాప్ అయిన స్టోరీ బోర్డ్ వీడియో క్లిప్‌లను ఆరు ఫ్రేములుగా విభజించి వాటిని కామిక్ బుక్-స్టైల్ టెంప్లేట్‌గా మార్చేస్తుంది. యాప్‌ను రీఫ్రెష్ చేయటం ద్వారా కొత్తకొత్త లేఅవుట్‌లతో పాటు
ఫ్రేమ్‌లను పొందే వీలుంటుంది. స్టోరీ బోర్డ్ యాప్‌లో 1.6 ట్రిలియన్ల పై చిలుకు కాంభినేషన్‌లను అందుబాటులో ఉంచినట్లు గూగుల్ తెలిపింది.

గూగుల్ నుంచి సరికొత్త ఫోటోగ్రఫీ యాప్స్

మరో అప్లికేషన్ సెల్ఫిస్మో మీ ఫోన్‌కు బ్లాక్ అండ్ వైట్ ఫోటో బూత్‌గా వ్యవహరిస్తుంది. ఈ యాప్ ద్వారా
సెల్ఫీ షూట్‌ను ప్రారంభించిన వెంటనే మీరు ఫోజు ఇచ్చిన ప్రతిసారి ఫ్రేమ్ క్యాప్చుర్ కాబడుతుంది. గూగుల్ ఎక్స్‌పిరిమెంటల్ రిసెర్చ్ టెక్నాలజీ ఆధారంగా స్పందించే ఈ యప్ బెస్ట్ సెల్ఫీని చిత్రీకరించుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.

గూగుల్ నుంచి సరికొత్త ఫోటోగ్రఫీ యాప్స్

మరో యాప్ స్ర్కబ్బీస్ ద్వారా వీడియోలకు కావల్సిన విధంగా డీజే-స్టైల్‌ను అద్ది రీమిక్స్ చేసుకునే వీలుంటుంది. ఈ మూడు యాప్స్ ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.

Airtel 4G Hotspot ధర తగ్గింది

English summary
Google has announced the launch of three photography apps called Storyboard, Selfissimo! and Scrubbies for Android and iOS.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot