Home
Apps

Google Maps లో సరికొత్త ఫీచర్స్!!! వీటిని మీరు గమనించారా??

ప్రపంచంలోని అతి పెద్ద సంస్థలలో ఒకటైన గూగుల్ విడుదల చేసిన అనేక సేవలలో గూగుల్ మ్యాప్స్ ఒకటి. గూగుల్ మ్యాప్స్ అనేవి ప్రపంచంలోని అన్ని ప్రాంతాల ఎక్కువ వివరాలను కలిగి ఉంది. సెర్చ్ దిగ్గజం గూగుల్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నావిగేషన్ యాప్ గూగుల్ మ్యాప్స్ కోసం ఇప్పుడు కొన్ని కొత్త అప్ డేట్ లను మరియు కొత్త ఫీచర్ లను ప్రకటించింది. కొత్త ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ మ్యాప్స్ 'కలర్ ఫుల్' ఫీచర్

గూగుల్ మ్యాప్స్ 'కలర్ ఫుల్' ఫీచర్

గూగుల్ మ్యాప్స్ యొక్క కొత్త అప్ డేట్ లలోని మరింత మెరుగైన వివరాలను మరియు గ్రాన్యులారిటీని జోడిస్తోంది. సహజమైన ఫీచర్లను సులభంగా చూడటం దీని లక్ష్యం. ఎవరైనా ఏదైనా ఒక స్థలాన్ని అన్వేషించిన్నప్పుడు దాని యొక్క సహజమైన లక్షణాలను సాధారణంగా చూడవచ్చు. ఇందులో మీరు నీలం రంగులో సరస్సులు, నదులు, మహాసముద్రాలు, లోయలు, శుష్క బీచ్‌లు మరియు ఎడారులను సులభంగా గుర్తించవచ్చు. వృక్షసంపదతో గల ఒక ప్రదేశంను ఆకుపచ్చ కలర్ లో మీరు ఒక చూపులో తెలుసుకోవచ్చు. అలాగే పర్వత శిఖరాలు మరియు శిఖరాలపై మంచు పరిమితులు ఉన్నాయో లేదో కూడా సులభంగా తెల్సుకోవచ్చు అని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

ప్రకృతి రంగులను చూపించడానికి

ప్రకృతి రంగులను చూపించడానికి

గూగుల్ మ్యాప్స్ యొక్క అప్ డేట్ లో ప్రకృతి యొక్క కలర్ ను చూపుతుంది. ఉదాహరణకు దట్టంగా గల అడవి ప్రాంతాన్ని ముదురు ఆకుపచ్చ కలర్ లో చూపుతుంది. అలాగే తేలిక పాటి పాచీ పొదలు ఉన్న ప్రాంతంను ఆకుపచ్చ కలర్ యొక్క తేలికపాటి నీడగా మ్యాప్ లో చూపుతుంది అని సంస్థ తన పోస్ట్ లో తెలిపింది. గూగుల్ మ్యాప్స్ ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద అందుబాటులో ఉంది. ఇది మొత్తంగా 220 దేశాలలోని భూభాగాల్లోని అన్ని రకాల ప్రదేశాలను 'కలర్ ఫుల్' అప్ డేట్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది.

గూగుల్ కలర్-మ్యాపింగ్ అల్గోరిథమిక్ పద్ధతి

గూగుల్ కలర్-మ్యాపింగ్ అల్గోరిథమిక్ పద్ధతి

గూగుల్ మ్యాప్ లో ఈ కలర్-మ్యాపింగ్ టెక్నిక్ ఎలా పని చేస్తుందో అని ఆలోచిస్తున్నారా? గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం మొదట ఉపగ్రహల నుండి సహజ లక్షణాలను గుర్తించడానికి కంప్యూటర్ దృష్టిని ఉపయోగిస్తాము. ఇందులో ప్రత్యేకంగా మంచుతో నిండిన ప్రాంతాలు, అటవీ మరియు పర్వత ప్రాంతాలను చూడవచ్చు. అప్పుడు గూగుల్ ఈ లక్షణాలను విశ్లేషించి వాటికి రంగుల శ్రేణిని HSV కలర్ మోడల్ లో కేటాయిస్తుంది.

గూగుల్ మ్యాప్ లో వివరణాత్మక స్ట్రీట్ సమాచారం

గూగుల్ మ్యాప్ లో వివరణాత్మక స్ట్రీట్ సమాచారం

గూగుల్ మ్యాప్ లో పూర్తి వివరాలు కలర్ ఫుల్ లో లభించడమే కాకుండా గూగుల్ మ్యాప్స్ పాదచారులకు మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా అందిస్తున్నది. రహదారి యొక్క ఖచ్చితమైన ఆకారం మరియు వెడల్పును చూపించే అత్యంత వివరణాత్మక వీధి సమాచారాన్ని వినియోగదారులు త్వరలో చూడగలరు. కాలిబాటలు, క్రాస్‌వాక్‌లు వంటివి ఎక్కడ ఉన్నాయో కూడా వినియోగదారులు గమనించవచ్చు.

Best Mobiles in India

English summary
Google Maps Brings New Features: Here are The Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X