గూగుల్ మ్యాప్‌లో మరో పవర్ పుల్ ఫీచర్ !
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మరో పవర్ పుల్ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ మరో పవర్ పుల్ ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. మ్యాప్స్ అప్లికేషన్‌లో కొత్తగా అందజేయనున్న ఫీచర్ ద్వారా యూజర్లు ప్రయాణంలో ఉన్నప్పుడు రియల్‌టైం నోటిఫికేషన్లను పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు వచ్చే స్టేషన్ వివరాలను తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది.

యాప్‌లో ముందుగా..
ఇందుకోసం యాప్‌లో ముందుగా యూజర్లు తమ ప్రయాణ వివరాలను, తాము వెళ్లే మార్గం సమాచారాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

రియల్ టైం నోటిఫికేషన్లను..
ఆ మార్గంలో యూజర్ వెళ్లేటప్పుడు మ్యాప్స్ యాప్ రియల్ టైం నోటిఫికేషన్లను ఇస్తుంది. ఒక వేళ ఆ మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లినా యాప్ నోటిఫికేషన్లను పంపుతుంది.

యూజర్ సెట్టింగ్స్‌ను బట్టి..
దగ్గర్లో ఉన్న బస్ స్టాప్, రైల్వే స్టేషన్ వంటి వివరాలను నోటిఫికేషన్ రూపంలో మ్యాప్స్ అప్లికేషన్ యూజర్‌కు పంపుతుంది. ఆ నోటిఫికేషన్లు యూజర్ సెట్టింగ్స్‌ను బట్టి ఫోన్ లాక్ స్క్రీన్‌పై కూడా దర్శనమిస్తాయి.

త్వరలోనే పూర్తి స్థాయిలో..
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను గూగుల్ అంతర్గతంగా పరిశీలిస్తున్నది. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది. కొత్త అప్‌డేట్ రూపంలో ఈ ఫీచర్ లభించనుంది.


Click it and Unblock the Notifications








