ప్లే స్టోర్‌లోకి గూగుల్ మ్యాప్స్ గో యాప్

By: BOMMU SIVANJANEYULU

తక్కువ ర్యామ్ కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన గూగుల్ మ్యాప్స్ గో యాప్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోంది. ఈ లైటర్ వర్షన్ యాప్‌ 1జీబి అంతకన్నా తక్కుమ ర్యామ్ సామర్థ్యం కలిగి ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది.

ప్లే స్టోర్‌లోకి గూగుల్ మ్యాప్స్ గో యాప్

కొద్ది రోజుల క్రితం న్యూఢిల్లీలో నిర్వహించిన ఓ ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్, ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్)ను విడుదల చేసిన విషయం తెలిసింది. ఈ లైటర్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను 512 ఎంబి నుంచి 1జీబి ర్యామ్‌లోపు స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

గూగల్ మ్యాప్స్ గో యాప్‌ను ఆండ్రాయిడ్ 4.1 లేదా ఆపై వర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై రన్ అయ్యే ఏ
స్మార్ట్‌ఫోన్‌లోనైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. జీమెయిల్ గో యాప్‌లా కాకుండా ఎక్కువ ర్యామ్ కలిగిన ఉన్న ఫోన్‌లను కూడా ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది.

గూగుల్ మ్యాప్స్ తరహాలోనే లొకేషన్, రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, డైరెక్షన్స్, ప్లేస్ సెర్చ్, ఫోన్ నెంబర్స్ సెర్చ్, అడ్రెస్ సెర్చ్ వంటి వంటి ఫీచర్లు గూగల్ మ్యాప్స్ గో యాప్‌లో అందుబాటులో ఉంటాయి. 70 దేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్ అందించగలుగుతుంది.

ఐడియా మళ్లీ 8 కొత్త ప్లాన్లతో దూసుకొచ్చింది !

ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల ప్రదేశాలకు సంబంధించిన వివరాలను గూగల్ మ్యాప్స్ గో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన 'గూగుల్ మ్యాప్స్' ఫీచర్‌ను మరింత లైవ్లీగా మార్చే క్రమంలో 'స్ట్రీట్ వ్యూ' అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలసిందే. ఈ అప్లికేషన్ ద్వారా యూజర్లు తాము ఎక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా సదరు ప్రాంతానికి సంబంధించిన ల్యాండ్‌మార్క్‌లను, చిహ్నాలను, చారిత్రక ప్రదేశాలను త్రీడైమన్ష్‌ (3డి)లో చూసే వీలుండేలా గూగుల్ టెక్నాలజీని వృద్ది చేసింది. 2007లో ప్రారంభమైన గూగుల్ 'స్ట్రీట్ వ్యూ'సర్వీస్ ఇప్పటికే అనేక దేశాలకు విస్తరించింది.

English summary
Starting today, Android users can try out a new Google Maps Go app that's a lighter version of Google Maps.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot