ఫుడ్ లవర్స్ కోసం గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్..
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన మ్యాప్స్ అప్లికేషన్‌కు సంబంధించి సరికొత్త ఫీచర్‌ను మార్కెట్టో అనౌన్స్ చేసింది.
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన మ్యాప్స్ అప్లికేషన్‌కు సంబంధించి సరికొత్త ఫీచర్‌ను మార్కెట్టో అనౌన్స్ చేసింది. గ్రూప్ ప్లానింగ్ ఫీచర్ పేరుతో ఈ టూల్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా మీరు సెజెస్ట్ చేసిన రెస్టారెంట్‌లకు సంబంధించిన అడ్రస్ లింకులను ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్, గ్రూప్ ప్లానింగ్ ఫీచర్ ఫీచర్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

షార్ట్‌లిస్ట్ చేసుకుని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవచ్చు...
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. యాప్ ఓపెన్ అయిన తరువాత Explore టాబ్‌లో కనిపించే రెస్టారెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తరువాత మీకు కావల్సిన లొకేషన్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వాలి. ఆ తరువాత స్ర్కీన్ క్రింద కనిపించే ఫ్లోటింగ్ బబుల్‌లోకి ఆ లింకును మూవ్ చేసుకుని, రెస్టారెంట్ల వివరాలను షార్ట్‌లిస్ట్ చేసుకున్న తరువాత వాటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసకునే వీలుంటుంది. ఆ తరువాత మిత్రులంతా కలిసి చర్చించుకుని మంచి రెస్టారెంటును సెలక్ట్ చేసుకునే అవకాశముంటుంది.

ట్రాక్ పేరుతో మరో కొత్త ఫీచర్..
ఆండ్రాయిడ్ యూజర్లు తమ లొకేషన్ తో పాటు ఫోన్ బ్యాటరీ లెవల్ కు సంబంధించిన వివరాలను ఇతరులతో షేర్ చేసుకునేందుకు వీలుగా 'track' పేరుతో సరికొత్త ఫీచర్ ను గూగుల్ ఇటీవల రోల్ అవుట్ చేసినట్లు తెలుస్తోంది. ఆడ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఈ బ్యాటరీ షేరింగ్ ఫీచర్ ప్రస్తుతానికి అందరికి అందుబాటులో లేదు. త్వరలోనే ఈ ఫీచర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గూగుల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆఫ్‌లైన్‌లోనూ గూగుల్ మ్యాప్స్..
మొబైల్ ఇంటర్నెట్ డేటాను పొదుపుగా వాడుకోవాలనే ఆలోచనలో ఉన్నవారు ఆఫ్‌లైన్ గూగుల్ మ్యాప్ప్ ఫీచర్‌ను ఉపయోగించటం ద్వారా డబ్బుతో పాటు విలువైన సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. గూగుల్ మ్యాప్ప్ ఆఫ్‌లైన్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్‌లో డివైస్‌లలో పనిచేస్తుంది. ఈ ఫీచర్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..
ముందుగా మీ ఫోన్‌లో మొబైల్ డేటాను ఆన్ చేసి గూగుల్ అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి. అప్లికేషన్ ఓపెన్ అయిన తరువాత మీరు ఆఫ్‌లైన్‌లో వీక్షించాలనుకుంటున్న ప్రదేశాన్ని సెర్చ్ చేసుకోవాలి. ఆ ప్రదేశానికి సంబంధించిన మ్యాప్ ఓపెన్ అయిన తరువాత దాని పై టాప్ చేసినట్లయితే సేవ్ మ్యాప్ టు యూజ్ ఆఫ్‌లైన్ పేరుతో మరో ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను ఓకే చేసినట్లయితే మ్యాప్ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఆ తరువాత నుంచి మొబైల్ డేటాతో పనిలేకుండా గూగుల్ మ్యాప్స్‌ను ఓపెన్ చేసుకుని మెనూలోని యువర్ ప్లేసెస్ విభాగంలో ఆఫ్‌లైన్ మ్యాప్‌లను ఉపయోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








