గూగుల్ మ్యాప్స్‌లోకి స్పీడ్ కెమెరాలు వచ్చేస్తున్నాయ్!

గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ ప్రాసెస్ అనేది ఎంత సునాయశంగా మారిందో మనందరికి తెలుసు.

|

గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నేవిగేషన్ ప్రాసెస్ అనేది ఎంత సునాయశంగా మారిందో మనందరికి తెలుసు. త్వరలో ఈ సర్వీసులో మరో కొత్త ఫీచర్ యాడ్ కాబోతోంది. మాషబుల్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం గూగుల్ మ్యాప్స్ ఇండియా వెర్షన్‌కు సంబంధించిన మొబైల్ యాప్‌లో స్పీడ్ కెమెరాలు యాడ్ కాబోతున్నాయి. ఈ కెమెరాలు ఓవర్ స్పీడింగ్ పట్ల చోదకులను అప్రమత్తం చేయటంతో పాటు ట్రాఫిక్ ఫైన్లు పడకుండా చూస్తుంది. ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్ తాను ప్రయాణించే రూట్లలో స్పీడ్ లిమిట్ వివరాలను తెలుసుకునే వీలుంటుంది.

Play Store అనుకొని క్లిక్ చేస్తే అంతే సంగతులు!Play Store అనుకొని క్లిక్ చేస్తే అంతే సంగతులు!

 ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్ చేసింది

ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్ చేసింది

తొలత ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన వివరాలను ఆండ్రాయిడ్ పోలీస్ రిపోర్ట్ చేసింది. ఈ వెబ్‌సైట్ షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్‌లో స్పీడ్ కెమెరాలు బ్లు కలర్‌లో కనిపిస్తాయి. రూట్ స్పీడ్ ఆరెంజ్ ఐకాన్స్‌లో కనిపిస్తుంది. యూజర్ స్పీడ్ కెమెరాకు చేరువైన ప్రతిసారి ఆడియో వినిపిస్తుంది. ఇక స్పీడ్ లిమిట్స్ విషయానికి వచ్చేసరికి రూట్‌కు సంబంధించిన స్పీడ్ లిమిట్ వివరాలు టర్న్ బై టర్న్ నేవిగేషన్‍‌ను ఉపయోగిస్తున్నపుడు యాప్ మెయిన్ స్ర్కీన్ పై బోటమ్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపిస్తాయి.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లకు

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లకు

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి త్వరలో లాంచ్ చేయబోయే అప్‌డేట్స్‌లో భాగంగా ఈ స్పీడింగ్ కెమెరా ఫీచర్ యాడ్ అవుతుంది. గూగుల్ ఇటీవల ఆటో రిక్షా మోడ్ పేరుతో కొత్త పబ్లిక్ రవాణా మోడ్‌ను తన మ్యాప్స్‌లో యాడ్ చేయటం జరిగింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని ప్రయాణికులు సజెస్టెడ్ రిక్షా రూట్లను తెలుసుకోవటం పాటు ఛార్జీల వివరాలను కూడా తెలసుకునే వీలుంటుంది. ఈ కొత్త ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్‌లోని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ క్యాబ్ మోడ్స్ విభాగంలో చూసుకోవచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించిన రిజల్ట్స్ Also Consider సెక్షన్‌లో కనిపిస్తాయి.

గూగుల్ మ్యాప్స్‌లో
 

గూగుల్ మ్యాప్స్‌లో

గూగుల్ మ్యాప్స్‌లో పార్కింగ్ లొకేషన్‌ ట్రాకింగ్ పేరుతో ఓ సరికొత్త ఫీచర్‌ను గూగుల్ ఇటీవల యాడ్ చేసింది. ఈ ఫీచర్‌ మీ స్మార్ట్‌ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే మీ డివైస్ ఆండ్రాయిడ్ మార్షమలో ఆపై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవ్వాల్సి ఉంటుంది. తదుపరి స్టెప్‌లో భాగంగా మీ డివైస్‌లోని గూగుల్ అసిస్టెంట్ అప్లికేషన్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి.

 

 

 గూగుల్ అసిస్టెంట్ సర్వీసెస్‌ను

గూగుల్ అసిస్టెంట్ సర్వీసెస్‌ను

యాప్‌ను అప్‌డేట్ చేసుకున్న తరువాత ఫోన్ లొకేషన్ సర్వీసెస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. ఇదే సమయంలో గూగుల్ అసిస్టెంట్ సర్వీసెస్‌ను వాయిస్ కమాండ్స్‌తో కాన్ఫిగర్ చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన అన్ని పర్మిషన్స్‌ను మీరు గ్రాంట్ చేయవల్సి ఉంటుంది. ముందుగా Ok Google' కమాండ్‌తో గూగుల్ అసిస్టెంట్‌ను ఓపెన్ చేయండి.

గూగుల్ అసిస్టెంట్‌ ఓపెన్ అయిన తరువాత

గూగుల్ అసిస్టెంట్‌ ఓపెన్ అయిన తరువాత

గూగుల్ అసిస్టెంట్‌ ఓపెన్ అయిన తరువాత 'Remember where I parked' అనే కమాండ్‌ను మీరు అప్లై చేసిన వెంటనే గూగుల్ అసిస్టెంట్ జీపీఎస్‌తో కోఆర్డినేట్ అయి స్పెషల్ పార్కింగ్ పిన్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆ తరువాత పార్కింగ్ లోకేషన్‌ను రిట్రీవ్ చేసుకుని నేవిగేషన్ ప్రారంభిస్తుంది.

Best Mobiles in India

English summary
Google Maps is getting a new feature that may help you 'dodge' a traffic challan.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X