గూగుల్ మ్యాప్స్‌లో దుమ్మురేపేలా కొత్త ఫీచర్
గూగుల్ నుంచి వచ్చే ప్రతి ఫీచర్ వినియోగదారులను కట్టిపడేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గూగుల్ యాప్స్ లో ప్రతి ఒక్కటీ ఒక్కో విధంగా యూజర్లకు ఉపయోగపడుతోంది.
గూగుల్ నుంచి వచ్చే ప్రతి ఫీచర్ వినియోగదారులను కట్టిపడేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గూగుల్ యాప్స్ లో ప్రతి ఒక్కటీ ఒక్కో విధంగా యూజర్లకు ఉపయోగపడుతోంది. వీటిల్లో ప్రధానంగా గూగుల్ మ్యాప్స్ గురించి చెప్పుకోవాలి. ఈ మ్యాప్స్ ద్వారా యూజర్లు తెలియని చిరునామాలను సైతం ఈజీగా కనిపెట్టేస్తుంటారు. కొన్ని ప్రతికూల ఫలితాలు అందించినా ఎక్కువ మందికి చాలా ఉపయోగకరంగానే ఈ మ్యాప్స్ ఉన్నాయని చెప్పవచ్చు.ఈ నేపథ్యంలో గూగుల్ మ్యాప్స్‌లోకి సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

చిరునామాలను సులభంగా తెలుసుకునేందుకు ఉపయోగపడిన మ్యాప్స్‌లో....
ఇప్పటి వరకు చిరునామాలను సులభంగా తెలుసుకునేందుకు ఉపయోగపడిన మ్యాప్స్‌లో ఇప్పుడు మరో అత్యంత ఉపయోగకరమైన ఫీచర్ వచ్చేసింది.

మ్యాప్స్ ద్వారా ఇకపై ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ తీసుకోవడం....
మ్యాప్స్ ద్వారా ఇకపై ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ తీసుకోవడం, రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేసుకోవడం వంటి ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు గూగుల్ పేర్కొంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండు ఫోన్లలోనూ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది.

బిజినెస్ ప్రొఫైల్ వద్ద ఉండే మెసేజ్ ఆప్షన్ ద్వారా...
బిజినెస్ ప్రొఫైల్ వద్ద ఉండే మెసేజ్ ఆప్షన్ ద్వారా చాట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, చాట్ చేయాలనుకున్న సంస్థ రిజిస్టర్ అయి ఉంటేనే ఈ ఆప్షన్ కనిపిస్తుందని గూగుల్ స్పష్టం చేసింది.

ఈ ఆప్సన్ రెండు ఫ్లాట్ ఫాలం మీద అందుబాటులోకి వచ్చింది....
ఈ ఆప్సన్ రెండు ఫ్లాట్ ఫాలం మీద అందుబాటులోకి వచ్చింది.ఈ ఫీచర్ పొందాలనుకున్న యూజర్లు సైడ్ మెనూలో క్లిక్ చేసి పొందవచ్చు. ‘‘ షూ స్టోర్ నుండి ఐ లవ్ యూ మామ్ '' అంటూ తన అనుకోకుండా వచ్చిన మెసేజ్ ని చూసి చాలా ఆశ్చర్యానికి లోనయ్యానని గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ ఆదిత్య టెండూల్కర్ అఫిియల్ బ్లాగ్ పోస్టులో తెలిపారు.

అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.....
అయితే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలామందికి ఈ ఫీచర్ కనపడటం లేదని చెబుతున్నారు. దీనికి గూగుల్ సమాధానం ఇచ్చింది. యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి గూగుల్ మై బిజినెస్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుని అందులోని మెనూ ఆప్సన్ ద్వారా ఈ మెసేజింగ్ ఫీచర్ ని పొందవచ్చని తెలిపింది.

గూగుల్ మ్యాప్స్ లో ఈ మధ్య ఓ మేజర్ అప్ డేట్ ని...
కాగా గూగుల్ మ్యాప్స్ లో ఈ మధ్య ఓ మేజర్ అప్ డేట్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ ద్వారా మీ ఫేవరేట్ కాంటాక్ట్స్ కి మ యొక్క ETAని షేర్ చేసుకోవచ్చు. అలాగే గత నెలలో లైవ్ లొకేషన్ ఆప్సన్ ని కూడా షేర్ చేసుకునే అవకాశాన్ని గత నెలలో గూగుల్ కల్పించిన సంగతి విదితమే.ఈ ఫీచర్ ద్వారా మీరు గమ్యానికి చేరగానే ఆటోమేటిగ్గా మీ లైవ్ లొకేషన్ క్లోజ్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications