చూపులేని వారికోసం గూగుల్ మ్యాప్‌లో సరికొత్త ఫీచర్
టెక్ గెయింట్ గూగుల్ తీసుకొచ్చిన గూగుల్ మ్యాప్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. ఇది మనిషి జీవితంలో ప్రముఖ పాత్రను పోషిస్తోంది. కప్ కాఫీ ఆర్డర్ ఇచ్చినంత ఈజీగా నేవిగేషన్ ద్వారా మనం ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. గూగుల్ కూడా ఎప్పటికప్పుడు యూజర్లు అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సరికొత్త ఫీచర్లను జోడించుకుంటూ వస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్లను అందిస్తోంది. అయితే చూపులేని వారు గూగుల్ మ్యాప్ ని ఎలా ఉపయోగించుకుంటారు. వారు చూడలేరు కనుక గూగుల్ మ్యాప్ ని ఉపయోగించుకోలేరు కదా అని అనుకుంటున్నారా..అయితే ఇలాంటి ఆలోచన గూగుల్ కి కూడా వచ్చింది. అయితే వారికోసం సరికొత్త ఫీచర్ ని గూగుల్ మ్యాప్ లోకి తీసుకువస్తోంది. దీని ద్వారా చూపులేని వారు కూడా గూగుల్ మ్యాప్ ఉపయోగించుకోవచ్చు.

World Sight Day
గూగుల్ మ్యాప్ టీం World Sight Day సంధర్భంగా చూపులేని వారికోసం గూగుల్ మ్యాప్ లో అదనంగా ఫీచర్ ని అనౌన్స్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా చూపులేని వారు కూడా అత్యంత ఈజీగా గూగుల్ మ్యాప్ ని వాడుకోవచ్చు. ‘‘వాయిస్ గైడెన్స్ '' ద్వారా వీరు గూగుల్ మ్యాప్ నుంచి తమకు కావాల్సిన దారిని వెతుక్కోవచ్చు.

గూగుల మ్యాప్
టోక్యో బేస్ డ్ బిజినెస్ ఎనాలసిస్ట్ Wakana Sugiyama చొరవ తీసుకుని దీనికి నాయకత్వం వహించాడు. ఇతను లీగల్ గా అంధత్వంతో ఉన్నాడు. ఇతను ఇప్పుడు గూగుల మ్యాప్ టీంకి అడ్వయిజర్ గా ఉన్నాడు. అతని సహాయంతోనే గూగుల్ ఈ రకమైన ఫీచర్ ని తీసుకువచ్చింది. చూపులేని వారు తమ చుట్టుపక్కల పరిసరాలలో యథేచ్చగా తిరిగేందుకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడింది. అలాగే ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి వెళ్లేందుకు, ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు ఈ గూగుల్ మ్యాప్ సహాయంతో ఈ ఫీచర్ చాలా సౌకర్యవంతంగా ఉంది. అయితే తెలియని ప్రదేశానికి వెళితే మాత్రం కొంచెం భయపడే అనుభవం ఎదురయింది. అని అతను తన బ్లాగులో రాసుకున్నాడు.

టోక్యో బేస్ డ్ బిజినెస్ ఎనాలసిస్ట్ Wakana Sugiyama చొరవ
ఈ ఫీచర్ వాడుతున్న ఆమె‘‘ నేను సరైన మార్గంలో వెళ్తున్నానా లేదా ఒక వీధి దాటడానికి సురక్షితంగా ఉందా అని తెలుసుకోవడం నాకు ఎప్పుడూ ఆందోళన కలిగించే అంశం అని ఆమె తెలిపింది. కాగా ఈ ఫీచర్ ద్వారా "నేను సరైన సమయంలో వీధికి సరైన వైపున ఉన్నాను, మరియు నేను నా గమ్యస్థానానికి చేరుకున్నాను, లేదా నేను ఇప్పటికే దాటిపోయానా అని తెలుసుకుని నాకు నేను తరచుగా ఆశ్చర్యపోతున్నాను." అని తెలిపింది.

జపాన్,యుఎస్ లో మాత్రమే
కాగా ప్రపంచవ్యాప్తంగా అంధులైన 36 మిలియన్ల మందిలో సుగియామా ఉన్నారు. ఈ పీచర్ ద్వారా దృష్టిలోపం ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు కేవలంఇంగ్లీష్ లో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా జపాన్. యుఎస్ లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఇంకా దీని మీద ప్రయోగం చేయాల్సి ఉంటుంది. అన్నీ పూర్తయిన తరువాత ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








