Google మ్యాప్‌లో కరోనా కేసుల అంచనా కోసం COVID-19 ఫీచర్!!
ప్రపంచం మొత్తం మీద ప్రజలు తెలియని ప్రాంతాలలో నావిగేషన్ కోసం ఉపయోగిస్తున్న సులభమైన టూల్ గూగుల్ మ్యాప్స్. గూగుల్ ఆధ్వర్యంలో పనిచేసే గూగుల్ మ్యాప్స్ ఇప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లను అప్ డేట్ చేస్తూ వస్తున్నది. ఈ వారం గూగుల్ మ్యాప్స్ మరొక కొత్త అప్ డేట్ తో ముందుకు వచ్చింది. దీని యొక్క వివరాలలోకి వస్తే స్థానిక ప్రాంతాలలో COVID-19 వ్యాప్తి యొక్క వివరణాత్మక సమాచారాన్ని చూపించడం ప్రారంభిస్తుందని ప్రకటించింది. వినియోగదారులు ప్రత్యేకించి COVID- సోకిన ప్రాంతానికి వెళుతుంటే తమ ప్రయాణాన్ని దానికి అనుగుణంగా ప్లాన్ చేయడానికి వీలుగా ఉంటుంది అని తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గూగుల్ మ్యాప్స్

గూగుల్ మ్యాప్‌లో కరోనా వ్యాప్తిని గుర్తించే విధానం
గూగుల్ మ్యాప్‌లో కరోనా యొక్క కేసుల అధిక సాంద్రత ఉన్న ప్రాంతాలను ముదురు రంగుతో తెలియజేయబడతాయి. అదేవిధంగా కేసులు తక్కువగా ఉంటే కనుక తేలికపాటి కలర్ ను కలిగి ఉంటుంది. మ్యాప్స్ ఇప్పటికే నగరాల్లోని కంటెమెంట్ జోన్ల గురించి కొత్త అప్ డేట్ లను ఇస్తున్నాయి. కానీ కొత్త అప్ డేట్ దాని సమాచార పర్యావరణ వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.

గూగుల్ మ్యాప్ COVID-19 ఫీచర్ అందుబాటు
గూగుల్ జాన్స్ హాప్కిన్స్ మరియు వివిధ దేశాల యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసే సమాచారం దృష్ట్యా వంటి మూలాల ద్వారా మరియు ఇప్పటికే ఉన్న డేటా ఆధారంగా గూగుల్ మ్యాప్‌లో COVID-19 ఫీచర్ పనిచేస్తుంది. ఈ కొత్త COVID-19 ఫీచర్ ఈ వారంలో గూగుల్ మ్యాప్స్ యొక్క ఆండ్రాయిడ్ మరియు iOS వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది.

గూగుల్ మ్యాప్‌లో మెరుగైన ట్రాఫిక్ అంచనా కోసం AI ఫీచర్
వినియోగదారుల యొక్క ప్రయాణ సమయాన్ని అంచనా వేయడానికి గూగుల్ GPS ద్వారా లభించే రియల్ టైమ్ ట్రాఫిక్ డేటాను ప్రస్తుతం ఉపయోగిస్తున్నది. కానీ డీప్‌మైండ్‌తో దాని భవిష్యత్ అంచనాలతో స్థానంతో పాటు ప్రయాణ సమయ ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది. దీని కోసం డీప్‌మైండ్ ఒక గ్రాఫిక్ న్యూరల్ నెట్‌వర్క్‌ను సృష్టించింది. రహదారి నాణ్యత, వేగ పరిమితులు మరియు ట్రాఫిక్ పరిస్థితులను అంచనా వేయడానికి AI ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ మొత్తం డేటాతో గూగుల్ మ్యాప్స్ వారి ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందే వినియోగదారులను అప్రమత్తం చేయగలదు.

Click it and Unblock the Notifications